Home సినిమాహీరో అవ్వకముందే గౌతమ్ కి ఆంటీ ఫ్యాన్స్: వాళ్ళు వీళ్లేనా! – ACPS NEWS

హీరో అవ్వకముందే గౌతమ్ కి ఆంటీ ఫ్యాన్స్: వాళ్ళు వీళ్లేనా! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


సూపర్ స్టార్ మహేష్ బాబు నటవారసుడిగా గౌతమ్ సెల్యులాయిడ్ పై తన హవా చాటాలని అభిమానులు కోరుకోవడం సహజం. ఒక రకంగా అభిమానుల హక్కు. ప్రస్తుతానికైతే గౌతమ్ సినిమాలపై ఉన్న అభిమానంతో ‘లెటర్‌బాక్స్’ (లెటర్‌బాక్స్) అనే గ్లోబల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తాను చూసిన వివిధ భాషల చిత్రాలకి రేటింగ్స్, రివ్యూలు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

కానీ ఇటీవల పలు సినిమాలకు లెటర్ బాక్స్ లో రివ్యూలు ఇస్తూ వైరల్ అవుతున్నాయి. సినిమాలకు రివ్యూ, రేటింగ్ లు ఇచ్చే లెటర్ బాక్స్ యాప్ లో గతంలో పలు సినిమాలకు రేటింగ్స్ ఇచ్చి, తన తండ్రి ఫ్లాప్ సినిమాలకు తక్కువ రేటింగ్స్ ఇచ్చి వైరల్ అయ్యాడు. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై రాసిన రివ్యూ టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ నెల 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించబడింది, ఈ మూవీని వీక్షించిన గౌతమ్ దీనికి కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే కేటాయించారు. ఈ సినిమాపై తన సమీక్షను వివరిస్తూ, చిత్రంలో సినిమాటోగ్రఫీ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో నటన మాత్రమే తనకు ఆకట్టుకున్నాయని, మిగిలిన సినిమా అంతా తీవ్రంగా నిరాశపరిచిందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ముఖ్యంగా ఈ చిత్ర ఎడిటింగ్ చాలా దారుణంగా మరియు చెత్తగా ఉందని లెటర్‌బాక్స్ ఖాతాలో ఘాటుగా రాసుకొచ్చారు.

కేవలం నాని సినిమానే కాకుండా గతంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ కి కూడా కనిష్టంగా 0.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా స్టార్ హీరోల సినిమాలకు సైతం ఎలాంటి మొహమాటం లేకుండా అత్యల్ప రేటింగ్స్ ఇస్తానంటూ సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా విపరీతమైన ట్రోల్స్, విమర్శలు ఎదురవుతున్నాయి. గౌతమ్ ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 400కు పైగా సినిమాలకు పైగా వ్యక్తిగత రేటింగ్స్, సమీక్షలను నమోదు చేయడం విశేషం. ఇందులో ఆయన తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్స్ అయిన ‘పోకిరి’, అలాగే యాక్షన్ థ్రిల్లర్ ‘1: నేనొక్కడినే’ లాంటి చిత్రాలకు అత్యధికంగా 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చి తన తండ్రి సినిమాలంటే అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకి 2.5 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం ద్వారా తాను ఎవరికీ భయపడకుండా కేవలం సినిమా కంటెంట్ ఆధారంగానే రేటింగ్స్ ఇస్తానని నిరూపించారు.

ఇది కూడా చదవండి: ‘కల్ట్’రిలీజ్ బాధ్యతలు వీరికే: ఏరియా వారి జాబితా చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

కేవలం సొంత సినిమాలకే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర హీరోల సినిమాలకి కూడా తన నిజాయితీతో కూడిన రేటింగ్స్ ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే, సోషల్ మీడియాలో కొందరు కరడుగట్టిన అభిమానులు ఈ రేటింగ్‌లను అస్సలు జీర్ణించుకోలేక గౌతమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఫ్యాన్స్‌గా మారుతున్నారు. నాని మరియు యశ్ లాంటి స్టార్ హీరోలను బహిరంగంగా విమర్శించడం వల్ల ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో ‘టాక్సిక్’ సినిమాకు 0.5 రేటింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇలాగే భారీ స్థాయిలో ట్రోల్స్ రావడంతో గౌతమ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ బయో నుంచి లెటర్ బాక్స్ లింక్‌ను కొద్దిసేపు తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ, సినిమాలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎవరికీ భయపడకుండా నిక్కచ్చిగా చెప్పాలంటే ఆయన తత్వమే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కిడ్స్ తోటి హీరోల సినిమాలను ఎప్పుడూ గుడ్డిగా పొగుడుతూనే ఉంటారు. కానీ గౌతమ్ మాత్రం సినిమా బాగోకపోతే మొహమాటం లేకుండా బాగోలేదని, నచ్చలేదని స్పష్టంగా చెప్పడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా నచ్చితే మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూనే, లోపాలను నిర్భయంగా ఎత్తిచూపుతూ ఆయన పారదర్శకంగా కొందరికి ప్రశంసలు తెస్తుంటే, మరికొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. హీరోగా అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందే ప్రేక్షకుల మధ్య ఇంతలా ట్రెండింగ్‌లో నిలుస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్న గౌతమ్ ఘట్టమనేని రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో నని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

[Gautam Ghattamaneni Getting Trolls Regarding Letter Box Reviews, Gautam Ghattamaneni Trolls, Gautam Ghattamaneni ABout Mahesh Babu, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment