అతిగా ఆలోచించడం అనేది కేవలం మానసికంగా మనల్ని అలసటకు గురి చేయడం కాదు.. శారీరక ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. మనసులో ఒకే పదే పదే తలచుకుంటూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదా గతాన్ని తవ్విపోస్తూ ఉండటం వల్ల శరీరంపై, మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అతిగా ఆలోచించే వ్యక్తి శారీరకంగా ఒకే చోట చూస్తూ, వారి కళ్లలో తీవ్రమైన గందరగోళం, అలసట కనిపిస్తుంది. ముఖంపై ఒత్తిడి రేఖలు, నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడవచ్చు. వారు చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ధ పెట్టలేరు.
పదే పదే నెగటివ్ ఆలోచనలు చేయడం వల్ల మెదడులో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల పెరుగుతుంది. ఇది క్రమంగా యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, తీవ్రమైన డిప్రెషన్‌కు వ్యాధి. రాత్రి పడుకునే సమయంలో మెదడుకు విశ్రాంతి దొరకకపోవడం వల్ల నిద్ర కరువవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే పగటిపూట అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిరంతర ఆందోళన వల్ల రక్తపోటు పెరగడం, గుండె జబ్బుల ప్రమాదం పెరగడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, జీర్ణక్రియ దెబ్బతిని కడుపులో అల్సర్లు లేదా గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఓవర్ థింకింగ్ నుంచి ఇలా బయటపడండి..
- రోజంతా ఆలోచించే బదులు, సాయంత్రం వేళ ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే మీ సమస్యల గురించి ఆలోచించండి, మిగిలిన రోజంతా ప్రస్తుత క్షణంలో బతకడానికి ప్రయత్నించండి.
- మీ మనసును వేధిస్తున్న ప్రశ్నలను, భయాలను ఒక పేపర్ మీద లేదా డైరీలో రాయండి. ఇలా చేయడం వల్ల మెదడుపై భారం తగ్గి, సమస్యలకు ప్రాక్టికల్ పరిష్కారాలు దొరుకుతాయి.
- ప్రతిరోజూ కనీసం 10-15 నిమిషాల పాటు శ్వాసపై ధ్యాస పెట్టే ప్రాణాయామం లేదా ధ్యానం చేయండి. యోగా, నడక వంటి శారీరక వ్యాయామాలు మెదడులో 'ఫీల్' గుడ్ హార్మోన్లను విడుదల చేసి ఆలోచనలను అదుపులో ఉంచుతాయి.

