
[ad_1]
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పెంపు అందరికి వర్తించదు. కేవలం న్యాయవ్యవస్థకు మాత్రమే. తెలంగాణలోని జిల్లా న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయాధికారులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ తీపి కబురు అందించింది. జిల్లా కోర్టుల్లోని అన్ని స్థాయిల న్యాయమూర్తుల పదవీ విరమణ (సూపర్‌యాన్యుయేషన్) వయసును 61 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గవర్నర్ శివ ప్రప్ శుక్లా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి అక్టోబరు 31న ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను అధికారికంగా జారీ చేశారు. ఈ చట్ట సవరణ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం సేవలందిస్తున్న అధికారులతో పాటు, నిర్ణీత నిబంధనలకు లోబడి రిటైర్ అయిన కొందరు అధికారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
తెలంగాణలో న్యాయాధికారుల వయోపరిమితిని పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు 2021లో చేసిన చట్ట సవరణ ప్రకారం పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచారు. తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు, అలాగే తెలంగాణ హైకోర్టు చేసిన సిఫార్సులను తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వయోపరిమితిని పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ అవసరాలకు సంబంధించిన చట్టంలో అవసరమైన మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
2026 మార్చి 31 తర్వాత మరియు ఈ ఆర్డినెన్స్ గెజిట్‌లో ప్రచురితమైన తేదీకి ముందు మధ్యంతర కాలంలో పదవీ విరమణ పొందిన న్యాయాధికారులకు కూడా ఈ 62 ఏళ్ల వయోపరిమితి ప్రయోజనం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ పెంపు అందరికీ నేరుగా వర్తించదు. తిరిగి విధుల్లోకి చేరాలంటే రిటైర్డ్ అధికారులు ఆర్డినెన్స్‌లో పలు కఠిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది:
ఈ షరతులన్నింటికీ కట్టుబడి అర్హత సాధించిన అధికారులకే తిరిగి న్యాయ విధుల్లో చేరే అవకాశం దక్కుతుంది.
ఇది కూడా చదవండి : అతడి కన్ను పడిందా టైర్లు మాయం..
న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సు పెంచడం ద్వారా సుదీర్ఘ అనుభవం కలిగిన న్యాయాధికారుల సేవలను న్యాయస్థానాలు మరికొంత కాలం వినియోగించుకునే వీలు కలుగుతుంది. కేసుల త్వరితగతిన పరిష్కారానికి ఇది దోహదపడుతుందని న్యాయ నిపుణులు. సుప్రీంకోర్టు, హైకోర్టు దిశానిర్దేశంతో తెలంగాణ వెలువడిన ఈ ఆర్డినెన్స్ న్యాయవ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
[ad_2]