Home Latest Newsఅర్నబ్ తీవ్ర తుపాను కాదు: అతి తీవ్ర తుపాను: వాతావరణ శాఖ హెచ్చరిక: ఆంధ్రా తీరం అల్లకల్లోలం.! | Arnab Cyclone Update Andhra Pradesh | సూపర్ తీవ్రమైన తుఫాను: బాపట్ల | విశాఖపట్నం | యానాం | భారీ వర్షాలు | సూపర్ టైడ్స్ – ACPS NEWS

అర్నబ్ తీవ్ర తుపాను కాదు: అతి తీవ్ర తుపాను: వాతావరణ శాఖ హెచ్చరిక: ఆంధ్రా తీరం అల్లకల్లోలం.! | Arnab Cyclone Update Andhra Pradesh | సూపర్ తీవ్రమైన తుఫాను: బాపట్ల | విశాఖపట్నం | యానాం | భారీ వర్షాలు | సూపర్ టైడ్స్ – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

అర్నాబ్ తీవ్ర తుపాను కాదనీ, అతి తీవ్ర తుపాననీ వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ, అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నబ్ తుపాను.. రానున్న గంటల్లో మరింత తీవ్రమై రేపటికి బాపట్ల, విశాఖ మధ్య యానం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది. తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 140 కిలోమీటర్లు, అంత కంటే ఎక్కువ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ తుఫాన్ కారణంగా కోస్తాంధ్ర యానాం ప్రభావం ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా తుపాను ప్రభావం కోస్తాంధ్రపైనే కాకుండా రాయలసీమపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

అలాగే తెలంగాణపై కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉంటుంది. తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్నాబ్ తుపాను నుంచి ఇంకా తక్కువ నష్టంతో బయటపడాలన్న లక్ష్యంతో అప్రమత్తంగా ఉంటూ,. అవసరమైన చర్యలు చేపట్టారు. రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

[Arnab Cyclone Update Andhra Pradesh, Super Severe Cyclone: ​​Bapatla,  Visakhapatnam, Yanam, Heavy Rains, Super Tides, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment