

కిరణ్ అబ్బవరం తన రూటు మార్చి ‘రియాలిటీ’ అనే మూవీతో దర్శకుడిగా అభిమానులు, ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సైతం ‘రియాలిటీ’ కి సంబంధించి ఇటీవల రిలీజైన ‘భజ గోవిందం… బ్రతుకే కోలాహలం’ సాంగ్ ని మెచ్చుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి ‘రియాలిటీ’ ఏ స్థాయి ఖ్వాలిటీ తో ముస్తాబవుతుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ అత్యంత భారీ ధరకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి.
ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ సంస్థ ‘రియాలిటీ’ సినిమా ఆడియో హక్కులను భారీ పోటీకి దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆడియో రైట్స్ అక్షరాల 3.5 కోట్ల భారీ ధరకి అమ్ముడయ్యాయి. ఒక యువ హీరో, డెబ్యూ డైరెక్టర్గా సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం స్థాయికి ఈ రేంజ్లో ఆడియో బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలని కూడా ఆశ్చర్యపరుస్తోంది. సినిమాపై ఉన్న హైప్ మరియు పాటల మీద ఉన్న నమ్మకంతోనే ప్రముఖ మ్యూజిక్ కంపెనీలు ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అదే విధంగా ఈ భారీ డీల్ ద్వారా సినిమాపై ఉన్న మార్కెట్ మరోసారి నిరూపితమైంది. జాయ్ ఫిలిమ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ విధంగా నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ నిర్మాతగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: హీరోయిన్ గా దేవయాని కూతురు!

ఇక ‘భజగోవిందం’ పాట యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు అదిరిపోయే బాణీలు అందించారు, ప్రముఖ సింగర్ వైకం విజయలక్ష్మి తన మంత్రముగ్ధులను చేసిన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. సాధారణ కమర్షియల్ పాటలకు భిన్నంగా, మనిషి జీవితం, కుటుంబాలు, సాటిఫ్యాక్షన్ మరియు మనశ్శాంతిని తెలిపేలా ఈ పాట సాగడం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాటకుడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే, సినిమాలోని ప్రతి పాట చార్ట్ బస్టర్గా నిలవడం ఖాయమని అర్థమవుతోంది. అందుకే ఈ విషయాన్నీ పసిగట్టే ‘సరిగమ సంస్థ’ అత్యధిక ధరకి దక్కించుకుంది. డిసెంబర్ 25 వరల్డ్ వైడ్ రిలీజ్ .
[kiran Abbavaram Reality Audio Rights, Kiran Abbavaram, Reality Movie, Audio Rights, Saregama Music, Bhaja Govindam Song, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
