Home సినిమాహీరోనే విలన్..! నిత్యా మీనన్ సిరీస్‌లో అదిరిపోయే ట్విస్టులు! – ACPS NEWS

హీరోనే విలన్..! నిత్యా మీనన్ సిరీస్‌లో అదిరిపోయే ట్విస్టులు! – ACPS NEWS

by
0 comments
హీరోనే విలన్..! నిత్యా మీనన్ సిరీస్‌లో అదిరిపోయే ట్విస్టులు!


ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడేవారికి ఒక బెస్ట్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రీత్: ఇన్‌టు ది షాడోస్’ ప్రస్తుతం మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కూతురిని కాపాడుకోవడానికి ఒక తండ్రి ఎంత దూరమైనా వెళ్తాడనే పాయింట్‌తో మొదలయ్యే ఈ కథ.. ఊహించని మలుపులు, వరుస హత్యలు, మానసిక సంఘర్షణలతో ఉత్కంఠను పెంచుతుంది. దీని గురించి ఓ లుక్ వేసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే… డాక్టర్ అవినాష్ సబర్వాల్ (అభిషేక్ బచ్చన్) ఒక సైకియాట్రిస్ట్. భార్య ఆభా (నిత్యా మీనన్), కుమార్తె సియాతో కలిసి అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. అయితే ఒకరోజు వారి చిన్నారి కూతురు సియా కిడ్నాప్‌కు వస్తోంది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకదు. నెలలు గడిచినా తమ కూతురు ఎక్కడుందో తెలియక అవినాష్, ఆభా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అప్పుడే అవినాష్‌కు ఓ మర్మమైన వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. తన కూతురిని తిరిగి పొందాలంటే తాను చెప్పిన ప్రాణాన్ని హత్య చేయాలని ఆ అపరిచితుడు షరతు పెడతాడు. కూతురిపై ఉన్న ప్రేమతో అవినాష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? ఈ ఉంటే అతడు ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

‘బ్రీత్: ఇన్‌టు ది షాడోస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. మొత్తం రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్‌లో మొదటి సీజన్ 2020లో, రెండో సీజన్ 2022లో విడుదలయ్యాయి. కిడ్నాప్ మిస్టరీలు, సీరియల్ కిల్లర్ కథలు, పోలీసుల దర్యాప్తు, ఊహించని ట్విస్టులు ఇష్టపడేవారికి ‘బ్రీత్: ఇన్‌టు ది షాడోస్’ ఒక మంచి ఛాయస్ . కాబట్టి ఇంకా ఈ సిరీస్ ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి.

మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

The post హీరోనే విలన్..! నిత్యా మీనన్ సిరీస్‌లో అదిరిపోయే ట్విస్టులు! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment