Home Latest Newsర్యాపిడోలో బంగారం పార్సిల్.. మధ్యలో మాయం చేసిన రైడర్.! | రాపిడో డెలివరీ బాయ్ దొంగతనం | హైదరాబాద్ గోల్డ్ పార్శిల్ చోరీ | జూబ్లీహిల్స్ పోలీస్ | బంగారు ఆభరణాలు తప్పిపోయాయి | రాపిడో పార్శిల్ సర్వీస్ మోసం | హైదరాబాద్ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ సీవీ ఆనంద్ | తెలుగు వన్ – ACPS NEWS

ర్యాపిడోలో బంగారం పార్సిల్.. మధ్యలో మాయం చేసిన రైడర్.! | రాపిడో డెలివరీ బాయ్ దొంగతనం | హైదరాబాద్ గోల్డ్ పార్శిల్ చోరీ | జూబ్లీహిల్స్ పోలీస్ | బంగారు ఆభరణాలు తప్పిపోయాయి | రాపిడో పార్శిల్ సర్వీస్ మోసం | హైదరాబాద్ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ సీవీ ఆనంద్ | తెలుగు వన్ – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవను ఆశ్రయించాడు. తన బంధువుల ఇంటికి విలువైన బంగారు నగలను సురక్షితంగా పంపించాలని భావించాడు. కానీ అతడి నమ్మకమే చివరకు కొంపముంచింది. పార్సిల్ తీసుకెళ్లిన ర్యాపిడో రైడర్.. గమ్యస్థానానికి చేర్చాల్సిన నగలతో మధ్యలో ఉదయించాడు. అంతేకాదు.. పెట్రోల్ ఖర్చుల పేరుతో అదనంగా డబ్బులు కూడా వసూలు చేశాడు. చివరకు ఫోన్ నంబర్ బ్లాక్ చేసి బాధితుడికి షాక్ ఇచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

బంగారం పార్సిల్‌తో మాయమైన రైడర్.!

వివరాల్లోకి వెళ్తే.. వివో సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన వద్ద ఉన్న రూ.62,383 విలువైన బంగారు నగలను నాగోల్‌లో ఉన్న బంధువుల ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఇతర ర్యాపిడో పార్సిల్ను బుక్ చేశాడు. సెక్యూరిటీ గార్డు వద్ద నుంచి ర్యాపిడో రైడర్ పార్సిల్‌ను తీసుకున్నాడు.

అయితే, పార్సిల్‌లో బంగారు నగలు గుర్తించిన రైడర్.. వాటిని గమ్యస్థానానికి చేర్చకుండా మధ్యలోనే మాయమయ్యాడు. పెట్రోల్‌పై ఖర్చుల పేరుతో బాధితుడి నుంచి ఫోన్‌పే ద్వారా రూ.100 కూడా తీసుకున్నాడు.

ఫోన్ చేస్తే నంబర్ బ్లాక్.!

పార్సిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఎదురుచూసిన బాధితుడికి ఎంతసేపటికీ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో రైడర్‌కు ఫోన్ చేయగా.. అతడి నంబర్ బ్లాక్ చేసినట్లు గుర్తించారు. పార్సిల్ ఎక్కడికి వెళ్లిందో తెలియక, రైడర్ నుంచి స్పందన లేక బాధితుడు ఆందోళనకు దిగాడు. ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

రైడర్ కోసం పోలీసుల గాలింపు.!

బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.62,383 విలువైన బంగారు నగలతో పరారైన ర్యాపిడో రైడర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక చిన్న పార్సిల్‌లో బంగారం పంపిన వ్యక్తి.. అది క్షేమంగా చేరుతుందని నమ్మాడు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ నగలతో రైడర్ మాయమవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటనతో పార్సిల్‌ను వినియోగించుకునే వారి భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

[ Rapido Delivery Boy Theft, Hyderabad Gold Parcel Theft, Jubilee Hills Police, Gold Jewellery Missing, Rapido Parcel Service Fraud, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]

You Might Also Like

You may also like

Leave a Comment