Home సినిమాడీజిల్‌పై ట్యాక్స్ పెంపు..! – iDreamPost – ACPS NEWS

డీజిల్‌పై ట్యాక్స్ పెంపు..! – iDreamPost – ACPS NEWS

by
0 comments
డీజిల్‌పై ట్యాక్స్ పెంపు..! - iDreamPost


అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచగా.. పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న పన్నును పూర్తిగా తొలగించింది. అక్టోబర్ 31 అమల్లోకి వచ్చే ఈ కొత్త పన్ను తదుపరి 15 రోజుల పాటు కొనసాగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా నిర్ణయం ప్రకారం డీజిల్ ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED), రోడ్ అండ్ ఫ్రాస్ట్రక్చర్ సెస్ కలిపి లీటరుకు రూ.8.50 నుంచి రూ.11.50కి పెరిగింది. అంటే ఒక్క లీటరుపై రూ.3 అదనపు పన్ను విధించబడుతుంది. అలాగే విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.10.50 నుంచి రూ.11కి పెంచారు. పెట్రోల్ మరోవైపు ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న లీటరుకు రూ.2.50 పన్నును సున్నాకు తగ్గించారు. దీంతో పెట్రోల్ ఎగుమతిదారులకు కొంత ఊరట లభించనుంది.

అంతర్జాతీయ పరిణామాలే కారణమా?

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో మార్పులు చోటుచేసుకోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో ఇంధన లభ్యతను పెంచడం, ఎగుమతిదారులు అంతర్జాతీయ ధరల వ్యత్యాసాల వల్ల అధిక లాభాలు పొందకుండా నియంత్రించడం విండ్‌ఫాల్ ట్యాక్స్ ప్రధాన ఉద్దేశం. అయితే దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం నేరుగా దేశీయ ఇంధన ధరల పెంపును సూచించదని గమనించాలి.

రచయిత అవతార్

సయ్యద్ నాగ్ పాషా

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. iDreamPost.comలో చీఫ్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ డెస్క్ వర్క్‌తో పాటు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్, లైఫ్ స్టైల్, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ కంటెంట్ కూడా రాస్తుంటాను. జర్నలిజం వృతిలోకి 2018లో వచ్చాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి జర్నలిజం స్కూల్ నుంచి ఈ జర్నీ మొదలైంది. ఆ తర్వాత సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌, సుమన్‌ టీవీ, టీవీ9 డిజిటల్‌లో సేవలు అందించాను.

You may also like

Leave a Comment