Home సినిమారూ.12 కోట్ల బంగారం కేసు.. ఇప్పుడు వీఐపీ దర్శనం.. రన్యారావు పేరు మళ్లీ వార్తల్లోకి.! – ACPS NEWS

రూ.12 కోట్ల బంగారం కేసు.. ఇప్పుడు వీఐపీ దర్శనం.. రన్యారావు పేరు మళ్లీ వార్తల్లోకి.! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి రన్యా రావు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె కర్ణాటకలోని ప్రముఖ హాసనాంబ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అయితే సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా, రన్యా రావు కుటుంబానికి ప్రత్యేక వాహనం, వీఐపీ దర్శనం కల్పించారన్న వార్తలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.

రన్యా రావు తన తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి రామచంద్రరావు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ వీఐపీ ప్రోటోకాల్ వాహనంలో ఆలయ ప్రాంగణానికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. గర్భగుడి సమీపంలోకి వెళ్లి హాసనాంబవారికి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన రన్యా రావు వద్ద రూ.12.56 కోట్ల 14.2 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఆమె అరెస్టయ్యారు. అనంతరం ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. 2026 ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలైన ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో కస్టమ్స్ శాఖ భారీ జరిమానా కూడా విధించినట్లు అక్టోబర్‌లో వార్తలు వెలువడ్డాయి.

సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటలతరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండగా, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల హోదా, పలుకుబడి ఉన్నవారికి ఒక రకమైన మర్యాదలు.. సామాన్య భక్తులకు మరో రకమైన పరిస్థితులా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయాల్లో వీఐపీ దర్శనాల విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

[Ranya Rao, Ranya Rao Hasanamba Temple Visit, Ranya Rao Gold Smuggling Case, Hasanamba Temple VIP Darshan, Ranya Rao Latest News, Karnataka News, Gold Smuggling Case, VIP Darshan Controversy]

You may also like

Leave a Comment