Home సినిమానువ్వు విలన్‌వా డాడీ? – iDreamPost – ACPS NEWS

నువ్వు విలన్‌వా డాడీ? – iDreamPost – ACPS NEWS

by
0 comments
నువ్వు విలన్‌వా డాడీ? - iDreamPost


రాకింగ్ స్టార్ యశ్ అంటే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే మాస్ హీరో. కానీ అలాంటి హీరో.. తన కొడుకు అడిగిన అమాయకమైన ప్రశ్నకు నీళ్లు నమలాల్సి వచ్చింది. నితీష్ తివారీ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాలో యశ్ లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర చేయడంపై ఇంట్లో తన కొడుకు వేసిన ప్రశ్న గురించి చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. తన కొడుకుతో జరిగిన ఓ సరదా సంఘటనను పంచుకున్నారు. “ఇంట్లో పిల్లలకు రామాయణం కథ తెలుసు. వాళ్ల దృష్టిలో రాముడు హీరో, రావణుడు చెడ్డవాడు. ఒకరోజు నా కొడుకు నా దగ్గరకు వచ్చి.. ‘డాడీ, నువ్వు రాముడివి ఎందుకు కాలేదు? నువ్వు సినిమాలో విలన్‌వా? అసలు నేను సినిమా చూసేటప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి?’ అని సూటిగా అడిగేశాడు. ఆ ప్రశ్న వినగానే ఒక్క క్షణం నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు” అని నవ్వుతూ చెప్పారు. పిల్లలకు సినిమా, నటన గురించి అర్థమయ్యేలా చెప్పడం పెద్ద టాస్క్ అయిపోయిందని అన్నారు.

“రావణుడు ఎంత పవర్‌ఫుల్, ఎంత గ్లామరస్‌గా కనిపించినా.. చివరికి గెలిచేది రాముడి మంచితనమే అని చెప్పాను. ‘కథ ప్రకారం అందరూ రాముడి వైపే ఉండాలిరా.. కాకపోతే సినిమాలో నా యాక్టింగ్ బాగుంటే నాకు సపోర్ట్ చెయ్, అంతేగానీ దీన్ని పర్సనల్‌గా తీసుకోకు’ అని వాడికి సర్దిచెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఓ వైపు హీరోగా పీక్ స్టేజ్‌లో ఉండి, మళ్లీ రావణుడి పాత్రను అంగీకరించడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు రాకింగ్ స్టార్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment