Home Latest News వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ | వచ్చే నెల నుంచి భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి| మొదటి| ఢిల్లీ| ప్రయాణీకులు – ACPS NEWS

వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ | వచ్చే నెల నుంచి భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి| మొదటి| ఢిల్లీ| ప్రయాణీకులు – ACPS NEWS

by Admin_swen
0 comments
వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ | వచ్చే నెల నుంచి భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి| మొదటి| ఢిల్లీ| ప్రయాణీకులు

అక్టోబర్ 25, 2025 9:32AMన పోస్ట్ చేయబడింది


ఓలా, ఉబెర్ వంటి రైడ్-హెయిరింగ్ సంస్థలకు పోటీగా భారతదేశ సహకార రంగం భారత్’ బ్రాండ్‌తో కొత్త టెక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వచ్చే నెల నుంచే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 300 కోట్ల రూపాయల విలువైన మూలధనంతో, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా డ్రైవర్లను నియమించుకుని.. డ్రైవర్లకు మెరుగైన రాబడిని అందించడం, ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన, సరసమైన సేవలను అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భారత్ బ్రాండ్ కింద ట్యాక్సే సర్వీసులను 8 సహకార సంస్థలు నిర్వహిస్తున్నాయి. మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి.

ఇందులో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టి లైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఫ్కో), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎఫ్), క్రిషాంక్ భారతీ కోపరేటివ్, ఎన్డీడీబీ, నాబార్డ్, ఎన్‌సీఈఎల్ సహా మొత్తం ఎనిమిది సహకార సంఘాలు ఉన్నాయి.

ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా రానున్న ఈ భారత్ టెక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి పాతిక శాతం చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇటు డ్రైవర్లకూ, అటు ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ముందుగా ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్న భారత్ టేక్సీ సేవలు ఈ ఏడాది చివరి నుంచీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird