Home Latest News విశాఖ అభివృద్ధికి నేత సహకారం.. సీఎం చంద్రబాబుతో నౌకాదళ వైస్ అడ్మిరల్ భేటీ | cbn వైజాగ్ పురోగతి కోసం నౌకాదళ సహాయాన్ని కోరింది| అధినేత| అడ్మిరల్| సంజయ్| భల్లా| కలుసుకుంటారు – ACPS NEWS

విశాఖ అభివృద్ధికి నేత సహకారం.. సీఎం చంద్రబాబుతో నౌకాదళ వైస్ అడ్మిరల్ భేటీ | cbn వైజాగ్ పురోగతి కోసం నౌకాదళ సహాయాన్ని కోరింది| అధినేత| అడ్మిరల్| సంజయ్| భల్లా| కలుసుకుంటారు – ACPS NEWS

by Admin_swen
0 comments
విశాఖ అభివృద్ధికి నేత సహకారం.. సీఎం చంద్రబాబుతో నౌకాదళ వైస్ అడ్మిరల్ భేటీ | cbn వైజాగ్ పురోగతి కోసం నౌకాదళ సహాయాన్ని కోరింది| అధినేత| అడ్మిరల్| సంజయ్| భల్లా| కలుసుకుంటారు

నవంబర్ 13, 2025 3:45PMన పోస్ట్ చేయబడింది


విశాఖ అభివృద్ధికి నేత సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు తెలిపారు. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన చంద్రబాబుతో నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా విశాఖ భవిష్యత్ ప్రణాళికల్లో నేవీ భాగస్వామ్యంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ కార్యకలాపాలను సంజయ్ భల్లా ముఖ్యమంత్రికి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ రంగంలో సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. స్వదేశీ నౌకా నిర్మాణం, సాంకేతిక అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే విశాఖ నగరం భవిష్యత్తులో అనేక అవకాశాలకు, ప్రతిష్ఠాత్మక సంస్థలకు కేంద్రంగా మారబోతోందనీ, ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటుందని చెప్పిన చంద్రబాబు.. ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం, నౌకాదళం కలిసి పనిచేయాలన్నారు.

విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగానూ, ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. నేవీ మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన పెరుగుతోంది. నౌకాదళం చేపట్టే వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు సీఎం హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird