
నవంబర్ 27, 2025 2:31PMన పోస్ట్ చేయబడింది

అయ్యప్ప స్వాములు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫారంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు గురువారం (నవంబర్ 27) డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
వీరికి బీజీవైసం కార్యకర్తలు తోడయ్యారు. అయ్యప్పట ముట్టడి కార్యక్రమంతో డీజీపీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయ్యప్ప దీక్షలో ఉన్న కంచన్బాగ్ ఎస్సై. కృష్ణకాంత్ కు విధుల్లో ఉండగా యూనిఫాం వేసుకోకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్పలు ఈ ముట్టడి కారణంగా ఉన్నారు.
విధుల్లో మతపరమైన దీక్షలు ఉండగా యూనిఫారం వేసుకోకపోవడంపై పోలీసు నిబంధనలకు విరుద్ధమని నోటీసు ఎస్ ఐ కృష్ణకాంత్ కు అడిషనల్ డీడీ మెమో జారీ చేయడం పట్ల అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలగడంతో పోలీసులు అయ్యప్ప స్వాములను అరెస్టు చేశారు.
