Home Latest News మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ | మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌| హైడ్రా| హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్| రియల్ ఎస్టేట్ మాఫియా| ప్రభుత్వ భూమి| సీఎం రేవంత్ రెడ్డి – ACPS NEWS

మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ | మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌| హైడ్రా| హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్| రియల్ ఎస్టేట్ మాఫియా| ప్రభుత్వ భూమి| సీఎం రేవంత్ రెడ్డి – ACPS NEWS

by Admin_swen
0 comments
మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ | మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌| హైడ్రా| హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్| రియల్ ఎస్టేట్ మాఫియా| ప్రభుత్వ భూమి| సీఎం రేవంత్ రెడ్డి

పోస్ట్ చేయబడింది జనవరి 10, 2026 4:02PM


ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం, మక్తా మహబూ బ్పేట పరిధిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. అక్రమ ఆస్తులు, తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నాలను హైడ్రా పూర్తిగా అడ్డుకుంది. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్‌ 44లో ఉన్న ప్రభుత్వ భూమి గత కొంతకాలంగా అక్రమ ఆక్రమణలకు గురవుతున్నట్లు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇదే సర్వే నంబర్‌లో గతంలోనే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, తాజాగా మరోసారి సమగ్ర విచారణ జరిపి 15 ఎకరాలకు పైగా భూమిని పూర్తిగా కాపాడినట్లు తెలిసింది. ఈ భూమి మియాపూర్– బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్ట సమీపంలో ఉండటంతో, రియల్‌టేట్ లాబీలు అక్రమ నిర్మాణాలకు యత్నించాయి.

గతంలోనే చెరువు కట్టపై సుమారు 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ అక్రమ వ్యాపారాల చర్యలతో తాజా ఆపరేషన్ విచారణ చేపట్టాల్సి ఉంది.హైడ్రా అధికారులు తాజాగా, తప్పుడు పత్రాల ఆధారంగా సర్వే నంబర్‌ 44లో దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సర్వే నంబర్‌ 159కి సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్‌ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకు అక్రమంగా కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.

అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టంగా స్పష్టంగా హైడ్రా అధికారులు అక్కడ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ భూమిపై ఇకపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, లావా దేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రామా చేస్తున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టడంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ అక్రమ దాడులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird