Home Latest News కెనడాలో భారీ చోరీ కేసు…భారత్ నిందితుల కీలక పాత్ర | కెనడాలో భారీ చోరీ కేసు| హైటెక్ దోపిడీ| బంగారు దోపిడీ కేసు| దుబాయ్| సిమ్రాన్ ప్రీత్ పనేసర్| అరేసలన్ చౌదరి| పరంపల్ సిద్ధు| అమిత్ జలోటా| ప్రసాత్ పరమలింగం| అలీ రజా – ACPS NEWS

కెనడాలో భారీ చోరీ కేసు…భారత్ నిందితుల కీలక పాత్ర | కెనడాలో భారీ చోరీ కేసు| హైటెక్ దోపిడీ| బంగారు దోపిడీ కేసు| దుబాయ్| సిమ్రాన్ ప్రీత్ పనేసర్| అరేసలన్ చౌదరి| పరంపల్ సిద్ధు| అమిత్ జలోటా| ప్రసాత్ పరమలింగం| అలీ రజా – ACPS NEWS

by Admin_swen
0 comments
కెనడాలో భారీ చోరీ కేసు...భారత్ నిందితుల కీలక పాత్ర | కెనడాలో భారీ చోరీ కేసు| హైటెక్ దోపిడీ| బంగారు దోపిడీ కేసు| దుబాయ్| సిమ్రాన్ ప్రీత్ పనేసర్| అరేసలన్ చౌదరి| పరంపల్ సిద్ధు| అమిత్ జలోటా| ప్రసాత్ పరమలింగం| అలీ రజా

పోస్ట్ చేయబడింది జనవరి 13, 2026 2:34PM


400 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని విమానాశ్రయం నుంచే మాయం చేసిన హైటెక్ దోపిడీ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. ముఖ్యంగా కెనడా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన రూ. 160 కోట్లకు పైగా విలువైన గోల్డ్ హీస్ట్ కేసులో మరో కీలక నిందితుడిని వేటాడి పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వెళ్తూ టొరంటో ఎయిర్‌పోర్టులో దిగగానే అరెసలాన్ చౌదరిని బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి, ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు వెల్లడవ్వడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.

కెనడా నేర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 20 మిలియన్ విలువైన విలువైన బంగారు దోపిడీ కేసులో కెనడా పోలీసులు మరో కీలక విజయాన్ని అందుకున్నారు. ‘ప్రాజెక్ట్ 24K’ పేరుతో జరుగుతున్న ఈ భారీ దర్యాప్తులో భాగంగా.. తాజాగా 43 ఏళ్ల వయసు కల్గిన అరెస్సెస్‌లాన్ చౌదరి అనే వ్యక్తిని పీల్ రీజినల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇతడు.. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2023 ఏప్రిల్ 17వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ నుంచి ఒక కార్గో విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది. అందులో సుమారు 400 కిలోల స్వచ్ఛమైన బంగారం, 2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉంది. అయితే విమానాశ్రయ ప్రాంగణం ఒక సురక్షిత ఈలోనికి తరలించిన కొద్దిసేపటికే అది అదృశ్యమైంది. ఎయిర్ కెనడా వ్యవస్థలను మోసం చేసి, నకిలీ పత్రాల ద్వారా అనేక దుండగులు ఈ దోపిడీకి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ (33) ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన పనేసర్.. ఎయిర్‌లైన్ సిస్టమ్స్‌ను మార్చడం ద్వారా ఈ కార్గో షిప్‌మెంట్‌ను పక్కదారి పట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. చండీగఢ్ శివార్లలోని ఒక అద్దె ఫ్లాట్‌లో గుర్తించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పనేసర్ కోసం కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో గాలింపు ముమ్మరం చేశారు.

ఈ భారీ దోపిడీకి సంబంధించి ఇప్పటి వరకు పది మందిపై ఆరోపణలు వచ్చాయి. వారిలో ఎక్కువ మంది భారత సంతతి వ్యక్తులు ఉండటం. ముఖ్యంగా తాజాగా అరెస్టయిన అరెసలాన్ చౌదరిపై దొంగతనం, నేరపూరిత కుట్ర వంటి కేసులు నమోదు చేయబడ్డాయి. 2024 మేలో భారత్ నుంచి కెనడాకు వస్తుండగా అర్చిత్ గ్రోవర్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి పరంపాల్ సిద్ధూ, అమిత్ జలోటా, ప్రసాత్ పరమలింగం, అలీ రాజా ఇప్పటికే అరెస్టు అయ్యారు. మరో నిందితుడు దురాంటే కింగ్-మెక్లీన్ ప్రస్తుతం ఆయుధాల అక్రమ రవాణా కేసులో అమెరికా కస్టడీలో ఉన్నాడు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird