
జనవరి 14, 2026 7:38AMన పోస్ట్ చేయబడింది

తిరుమలలో భోగి పండుగ సందర్భంగా బుధవారం (జనవరి 14) వేకువజామునే ఆలయం ముందు అర్చకులు, సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరాయణంలో మొదటిగా వచ్చే పండుగ భోగి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస కైంకర్యాలు జరిగాయి. ప్రతి ఏడాది ఆలయం ముందు భోగి మంటలు వేసి భోగి వేడుకల్లో భక్తులను భక్తులు చేయడం ఆనవాయితీ.
అందులో భాగంగానే బుధవారం (జనవరి 14) భోగి సందర్భం మహాద్వారానికి ముందు భోగి మంటలు వేసి వేడుక జరిగింది. అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తిరుమలలో భోగి పండుగ చేసుకున్నారు. తిరుమలలోని తన క్యాంపు సిబ్బందితో కలిసి చైర్మన్ భోగి పండుగను జరుపుకున్నారు. భోగి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన భోగి పండుగ అందరికీ భోగ భాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు.
