Home Latest News రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి | థాయిలాండ్ రైలు ప్రమాదం| బ్యాంకాక్| సిఖియో జిల్లా| హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్| రెస్క్యూ టీమ్‌లు| క్రేన్ కుప్పకూలింది|ఉబోన్ రాట్చథాని| పిపాట్ రట్చకిత్ప్రకర్న్ – ACPS NEWS

రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి | థాయిలాండ్ రైలు ప్రమాదం| బ్యాంకాక్| సిఖియో జిల్లా| హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్| రెస్క్యూ టీమ్‌లు| క్రేన్ కుప్పకూలింది|ఉబోన్ రాట్చథాని| పిపాట్ రట్చకిత్ప్రకర్న్ – ACPS NEWS

by Admin_swen
0 comments
రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి | థాయిలాండ్ రైలు ప్రమాదం| బ్యాంకాక్| సిఖియో జిల్లా| హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్| రెస్క్యూ టీమ్‌లు| క్రేన్ కుప్పకూలింది|ఉబోన్ రాట్చథాని| పిపాట్ రట్చకిత్ప్రకర్న్

జనవరి 14, 2026 11:11AMన పోస్ట్ చేయబడింది


థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బ్యాంకాక్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో కదలుతున్న రైలు మీద క్రేన్ పడింది. దీనితో రైలు పట్టాలు తప్పి బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా 79 మందికి పైగా గాయపడ్డారు. రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు స్ధానిక అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైలులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీసేందుకు స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్యను నఖోన్ రాట్చసిమా పోలీస్ చీఫ్ ధృవీకరించారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని థాయ్‌లాండ్ రవాణా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird