Home Latest News నేడే భారత్, కివీస్‌ 3వ టీ20 మ్యాచ్‌ | టీమ్ ఇండియా|క్రికెట్| ఇండియా vs న్యూజిలాండ్| T20 రికార్డ్| వేగవంతమైన T20 చేజ్| సూర్యకుమార్ యాదవ్| పాకిస్థాన్ క్రికెట్| T20 వరల్డ్ కప్| క్రికెట్ రికార్డ్స్| 3వ టీ20| గౌహతి| అక్షర్ పటేల్ – ACPS NEWS

నేడే భారత్, కివీస్‌ 3వ టీ20 మ్యాచ్‌ | టీమ్ ఇండియా|క్రికెట్| ఇండియా vs న్యూజిలాండ్| T20 రికార్డ్| వేగవంతమైన T20 చేజ్| సూర్యకుమార్ యాదవ్| పాకిస్థాన్ క్రికెట్| T20 వరల్డ్ కప్| క్రికెట్ రికార్డ్స్| 3వ టీ20| గౌహతి| అక్షర్ పటేల్ – ACPS NEWS

by Admin_swen
0 comments
నేడే భారత్, కివీస్‌ 3వ టీ20 మ్యాచ్‌ | టీమ్ ఇండియా|క్రికెట్| ఇండియా vs న్యూజిలాండ్| T20 రికార్డ్| వేగవంతమైన T20 చేజ్| సూర్యకుమార్ యాదవ్| పాకిస్థాన్ క్రికెట్| T20 వరల్డ్ కప్| క్రికెట్ రికార్డ్స్| 3వ టీ20| గౌహతి| అక్షర్ పటేల్

పోస్ట్ చేయబడింది జనవరి 25, 2026 12:39PM


గువాహటి వేదికగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య 3వ టీ20 జరగనుంది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి జోరు మీద ఉన్న ఇంకా 3వ టీ20 పై కన్నేసింది. ఎలాగైనా ఈ టోర్నమెంట్ లో బోణీ కొట్టాలన్న కసితో కివీస్ ఉంది. భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చూపుతున్నారు. చేతికి గాయం అయిన నేపథ్యంలోనే రెండవ టీ20కి దూరమై, ఇట్టి మ్యాచ్‌లో మాత్రం ఆడుతున్నాడని స‌మాచారం. అదే సమయంలో డేంజ‌ర్ బౌల‌ర్‌ బుమ్రాను కూడా తీసుకుంటారట. మొన్న అర్షదీప్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. దీంతో అతడిని తప్పించి బుమ్రాను తీసుకుంటాడని అంటున్నారు. ఇటు అక్షర్ పటేల్ బరిలోకి దిగితే, వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ పైన వేటు పడే అవకాశం ఉంది.

రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 209 పరుగులను మరో 28 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరుతో ఉండేది. సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్(రెండో టీ20లో విధ్వంసం సృష్టించాడు.

కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. న్యూజిలాండ్‌పై వేగవంతమైన టీ20 అర్ధశతకాన్ని సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఇషాన్ మొత్తం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. గత కొంత కాలంతో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్కై.. 463 రోజుల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ బాదాడు. సూర్య కెప్టెన్ నాక్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.భారత గడ్డపై సరిగ్గా ఆడిన 100వ టీ20 మ్యాచ్ ఇది. రాయ్‌పుర్ వేదికగా జరిగిన ఈ మైలురాయి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. మరోవైపు 200కి పైగా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడం ఇది ఆరో సారి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(7 సార్లు) అగ్రస్థానంలో ఉంది.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird