Home Latest News రోజూ చేస్తే ఈ చిన్న తప్పులే మధుమేహం రావడానికి కారణం..! | మధుమేహ రోగులు చేసే సాధారణ తప్పులు| ఈ చిన్న తప్పుల వల్ల మధుమేహం వస్తుంది| మధుమేహం తప్పులు మరియు వాటిని ఎలా నివారించాలి| మధుమేహంలో అపార్థాలు మరియు వివాదాలు – ACPS NEWS

రోజూ చేస్తే ఈ చిన్న తప్పులే మధుమేహం రావడానికి కారణం..! | మధుమేహ రోగులు చేసే సాధారణ తప్పులు| ఈ చిన్న తప్పుల వల్ల మధుమేహం వస్తుంది| మధుమేహం తప్పులు మరియు వాటిని ఎలా నివారించాలి| మధుమేహంలో అపార్థాలు మరియు వివాదాలు – ACPS NEWS

by Admin_swen
0 comments
news-logo

మధుమేహం చాలామందిని కుదిపేస్తున్న సమస్య. ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో మధుమేహం కనిపిస్తుంది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే బారిన పడుతున్నారు. మరీ దారుణం.. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఉంటోంది. అయితే రోజువారీ జీవితంలో చిన్న తప్పులే మధుమేహం రావడానికి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ డయాబెటిస్ రావడానికి రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే..


జన్యు సమస్య కాదు..

మధుమేహం అనేది తల్లిదండ్రుల నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు. దీన్ని జన్యుపరమైన సమస్యగా చెబుతారు. అయితే ఎక్కువగా ఆధునిక జీవనశైలి, ఆహారం, శరీరానికి కష్టం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల వస్తోంది.

ప్రాచీన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..

ప్రాచీన భారతీయ గ్రంథాలు అయిన చరక సంహితలో చరకాచార్యుడు మధుమేహం ను మధుమేహం గా వివరించాడు. మూత్రంలో తీపి రుచి ఉండటం ద్వారా దీన్ని గుర్తించారట.

సుశ్రుత సంహితలో సుశ్రుతుడు 20రకాల మధుమేహాలను చెప్పి ఈ లక్షణాలు, కారణాలు, చికిత్సలను కూడా తెలిపాడు.

పై విషయాలను బట్టి చూస్తే.. మధుమేహం అనేది పూర్వ కాలం నుండే ఉన్నా.. అది నేటికాలంలో మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది.

ఇన్సులిన్ వ్యవస్థ..

శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థను పాడు చేస్తే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. వీటిని చాలా వరకు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది.

అల్పాహారం..

అల్పాహారాన్ని దాటవేడయం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనకు అంతరాయం కలుగుతుంది. బోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది క్రమంగా వ్యాధికి.

ఎక్కువ సేపు కూర్చోవడం..

ఒకప్పుడు బాగా పని చేసి.. అలసిపోయినప్పుడు కొద్దిసేపు కూర్చొనేవారు. కానీ నేటికాలంలో ఆఫీసులలో గంటలు గంటలు పనిచేయడం.. నాలుగు గంటలకు ఒకసారి బ్రేక్ పేరుతో కొద్దిసేపు లేచి తిరగడం. దీని వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితంగా మారిపోతాయి. శరీరం గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదిస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ పేర కోసం దారి తీస్తుంది.

ఆలస్యంగా, భారీగా తినడం..

రాత్రి భోజనం ఎప్పుడూ 7 లేదా 8 గంటల లోపు తినాలని చెబుతారు. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు పెద్దలు. అంటే ఇంట్లో దీపం వేయడం, రాత్రి సాయంత్రం ఆహారం తీసుకోవడం ఒకేసారి జరగాలని దీని ఉద్దేశ్యం. అంతలోపు తీసుకోకపోయినా కనీసం 7 నుండి 8 లోపు తీసుకోవాలి. కానీ ఆలస్యంగా 10 గంటలకు లేదా 11 గంటలకు పైన తినడం, అది కూడా చాలా భారీగా తింటారు. ఈ అలవాటు కొన్ని నెలలు, ఏళ్ల పాటు కొనసాగితే డయాబెటిస్ పక్కాగా వస్తుంది.

*రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird