Home Uncategorizedకొత్తగూడెం కార్పొరేషన్‌లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

కొత్తగూడెం కార్పొరేషన్‌లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

by Sahasra ACPS
0 comments

కొత్తగూడెం కార్పొరేషన్‌లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిడ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలుప్రధాన రహదారిపై 11 విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభంపాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:నగర పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం నగర పాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్ తెలిపారు.పాల్వంచలోని కాంట్రాక్టర్స్ కాలనీ, బాపూజీ నగర్ పరిధిలో డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, పిచ్చిమొక్కల తొలగింపు తదితర సమస్యలపై స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులపై మేయర్ మంగళవారం స్వయంగా స్పందించారు. సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. భద్రాచలం రోడ్డు నుంచి నాలుగు డివిజన్లకు వెళ్లే ప్రధాన రహదారిపై చీకటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అధికారుల సమక్షంలో 11 విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను ప్రారంభించారు.ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం లేకుండా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పనులతో 7వ, 42వ డివిజన్లతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందని తెలిపారు.— సహస్ర ACPS న్యూస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📞 వార్తలు / సమాచారం కోసం సంప్రదించండి: 9581706709

Leave a Comment