

వరంగల్ అమ్మాయి ఆనంది ఉత్తరాంధ్ర లెజండ్రీ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ తో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించింది. ఆనందం కోసమే ‘గరివిడి లక్ష్మి ‘ని రెండు సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంచు కూడా పిన్ టూ పిన్ తగ్గకుండా ఒరిజినల్ గరివిడి లక్ష్మిని కళ్ళ ముందు ఉంచింది. నటించడం కాదు జీవించడం అంటే ఏంటో మరోసారి సెల్యులాయిడ్ కి, ప్రేక్షకులకి రుచి చూపించింది.
దీనితో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా ఆనంది తదుపరి ప్రాజెక్టులపై అందరి దృష్టి. క్యారక్టర్ లో ఉండే విభిన్నత, కథలోని బలాన్ని బట్టి సినిమాలు ఎంచుకునే ఆనందం, మళ్లీ ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతారనే మాటలు వినిపిస్తున్నాయి.ఇంకో లెజండ్రీ మణి బయోపిక్ లో కూడా చేస్తుందని, త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం పరిస్థితి ఏంటి: హిట్ కొడుతున్నారా..అది జరిగితే మాత్రం!

ఆనంది సుదీర్ఘ కాలం నుంచి తమిళ నాట తన హవా చాటుతూ ఉంది. దీనితో ఆనంది మా అమ్మాయి అని తమిళ ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్పే పరిస్థితి. అక్కడి హిట్ లిస్ట్ చాలా పెద్దదే.
[Anandhi Next Project Details, Anandhi next project, Garividi Lakshmi movie, Anandhi upcoming movies, Garividi Lakshmi box office, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
