Home సినిమానేలలో పాతిపెట్టిన డ్రమ్ముల నిండా నోట్లు – ACPS NEWS

నేలలో పాతిపెట్టిన డ్రమ్ముల నిండా నోట్లు – ACPS NEWS

by
0 comments
నేలలో పాతిపెట్టిన డ్రమ్ముల నిండా నోట్లు


అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన వారి లైఫ్ స్టైల్ ఉంది. కొత్త ఇల్లు కడుతున్నారు. అంత డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో అని గ్రామస్తుల్లో అనుమానం మొదలయ్యింది. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా.. నేలలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో కోట్ల రూపాయలు దర్శనం ఇచ్చాయి. ఇప్పుడీ సంఘటన వైరల్ గా మారింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ మైండ్ బ్లాక్ అయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులకు ఇంట్లో పాతిపెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ములు లభ్యమయ్యాయి. వాటిని తెరిచి చూసిన అధికారులకు కళ్లు చెదిరే రీతిలో రూ.5 కోట్లకు పైగా విలువైన నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దొంగతనాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును దాచేందుకే భూమిలో ఇలా పాతిపెట్టారనే అనుమానంతో పోలీసులు ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

రాత్రికి రాత్రే విద్యుత్ నిలిపివేసి మెరుపు దాడి

ప్రయాగ్‌రాజ్ పరిధిలోని నవాబ్‌గంజ్‌కు చెందిన రాకేశ్‌ యాదవ్‌ అలియాస్‌ ‘మహాకాళ్‌’ అనే వ్యక్తి ఆస్తులు, వ్యాపారాలపై స్థానికులకు చాలాకాలంగా అనుమానాలు ఉన్నాయి. అతడి పూర్వీకుల ఇంట్లో భారీ మొత్తంలో అక్రమ సంపద దాచి ఉంచారన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసిస్టెంట్ డీసీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రహస్య ఆపరేషన్ చేసింది. గ్రామం మొత్తానికి ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, అనుమానిత ఇంటిని చుట్టుముట్టారు.

డ్రమ్ములు తెరిచి చూసి షాకైన సిబ్బంది

ఇంట్లోని ఓ మూలన అనుమానాస్పదంగా ఉన్న ప్రదేశంలో పోలీసులు నిశితంగా తవ్వకాలు జరిపారు. భూమి పొరల్లో దాచిపెట్టిన మూడు భారీ డ్రమ్ములను బయటకు తీశారు. వాటి మూతలు తీసి చూడగా రూ.500 నోట్ల కట్టలు రాశులుగా కనిపించడంతో సీన్ చూసి పోలీసు సిబ్బంది అవాక్కయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న రూ.కోట్ల నగదు లెక్కింపు మరియు తదుపరి చర్యల కోసం పోలీసులు ఆదాయ పన్ను (IT) శాఖ అధికారులకు సమాచారం అందించారు.

కుటుంబ సభ్యుల విచారణ..

ఈ ఘటనకు సంబంధించి రాకేశ్ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు వారి పండ్లతోటలు, వ్యవసాయ క్షేత్రాల్లోనూ మరిన్ని రహస్య ఆస్తులు లేదా నగదు దాచారా అనే కోణంలో సోదాలు జరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రచయిత అవతార్

ధరణి

You may also like

Leave a Comment