Home Latest Newsటీమ్ ఇండియా బౌలర్లను ఉతికారేసిన గ్లెన్ ఫిలిప్: నాలుగో టి20లో చేతులెత్తేసిన ఇండియా.! | న్యూజిలాండ్ విజయం | 4వ టీ20 | గ్లెన్ ఫిలిప్స్ | సెంచరీ – ACPS NEWS

టీమ్ ఇండియా బౌలర్లను ఉతికారేసిన గ్లెన్ ఫిలిప్: నాలుగో టి20లో చేతులెత్తేసిన ఇండియా.! | న్యూజిలాండ్ విజయం | 4వ టీ20 | గ్లెన్ ఫిలిప్స్ | సెంచరీ – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

భారత్ తో ఐదు టి20లసిరీస్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ లలో పరాజయం పాలైన న్యూజిలాండ్ అద్భుతంగా పుంజుకుంది. ఇప్పటికే 3-0తో వెనకబడి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ ను చేజార్చుకున్న న్యూజిలాండ్.. నాలుగో టి20లో ఆశమే హద్దుగా చెలరేగింది. బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ ను 87 పరుగుల ఆధిక్యతతో చేజిక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు. కొండంత లక్ష్యాన్ని టీమ్ ఇండియాకు నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా జావకారిపోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయింది మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కివీస్ బ్యాటర్లు.. భారత బౌలర్లను నిజంగా ఓ ఆటాడుకున్నారు. ముఖ్యంగా కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ తన విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లో ఇరు ఫోర్లు, పది సిక్సర్లతో 107 పరుగులు సాధించాడు. అలాగు మైకేల్‌ బ్రేస్‌వెల్‌ పాతిక బంతుల్లో 4 ఫోర్లు, అరడజను సిక్సర్లతో 65 పరుగులు సాధించాడు.

అనంతరం నిర్ణీత 20 ఓవర్లలో 260 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఏ దశలోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. భారీ లక్ష్య సాధన ఒత్తిడిలో వేగంగా ఆడే ప్రయత్నంలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌లో టీమ్ ఇండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించింది.

[Newzeland Victory, 4th T20, Glen Philips, Century, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment