Home Latest Newsబంగారం కోసం బరితెగింపు.. జోగినిని కట్టేసి కిరాతకంగా హత్య. ! | చౌటుప్పల్ హత్య కేసు | జోగిని హత్య | యాదాద్రి భువనగిరి క్రైమ్ | బంగారు దోపిడీ | 60 తోల బంగారం దొంగతనం | తెలంగాణ నేర వార్తలు | చౌటుప్పల్ క్రైమ్ | సిద్దిపేట పోలీసులు | అస్సాం అనుమానితులు | బంగారం కోసం హత్య | రూ.10 లక్షల నగదు చోరీ | తెలంగాణ పోలీసుల విచారణ | దోపిడీ మరియు హత్య – ACPS NEWS

బంగారం కోసం బరితెగింపు.. జోగినిని కట్టేసి కిరాతకంగా హత్య. ! | చౌటుప్పల్ హత్య కేసు | జోగిని హత్య | యాదాద్రి భువనగిరి క్రైమ్ | బంగారు దోపిడీ | 60 తోల బంగారం దొంగతనం | తెలంగాణ నేర వార్తలు | చౌటుప్పల్ క్రైమ్ | సిద్దిపేట పోలీసులు | అస్సాం అనుమానితులు | బంగారం కోసం హత్య | రూ.10 లక్షల నగదు చోరీ | తెలంగాణ పోలీసుల విచారణ | దోపిడీ మరియు హత్య – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం రేపింది. బంగారు ఆభరణాలు, నగదు కోసం ఓ జోగిని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. ఏకంగా ఇంట్లో చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి ప్రాణాలు తీశారు. అనంతరం ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో బంగారం, నగదుతో పాటు కారును కూడా ఎత్తుకెళ్లారు.

చౌటుప్పల్‌లోని మార్కండేయ నగర్ కాలనీలో నివాసముంటున్న జోగిని రాళ్లబండి సుధాకర్ (48)ను గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. సుధాకర్ కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదును దోచుకున్నారు. అక్కడితో ఆగకుండా ఇంటి వద్ద ఉన్న కారును సైతం తీసుకుని పరారయ్యారు.

ఒకవైపు ప్రాణాలు తీసి.. మరోవైపు భారీ మొత్తంలో సొత్తును దోచుకెళ్లడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. హత్య జరిగిన తీరును పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సిద్దిపేట సమీపంలోని నిందితుల పట్టివేత.!

ఇదిలా ఉంటే.. ఈ కేసులో పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. హత్య అనంతరం సుధాకర్ కారులో పరారవుతున్న నిందితులను సిద్దిపేట సమీపంలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు అస్సాంకు చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. బంగారం, నగదు కోసమే ఈ హత్యకు పాల్పడ్డారా? సుధాకర్‌ను ముందుగానే లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం హత్య చేశారా? ఈ దారుణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంగారం, నగదు కోసం మనిషి ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన చౌటుప్పల్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితుల పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు పోలీసుల అధికారిక ప్రకటనతో వెల్లడికావాల్సి ఉంది.

[ Choutuppal Murder Case, Jogini Murder, Yadadri Bhuvanagiri Crime, Gold Robbery, 60 Tolas Gold Theft, Telangana Crime News, Choutuppal Crime, Siddipet Police, Assam Suspects, Murder for Gold, Rs 10 Lakh Cash Theft, Telangana Police Investigation, Robbery and Murder, Breaking Crime News ]

You Might Also Like

You may also like

Leave a Comment