Home సినిమారైతుకు కోట్లు కురిపిస్తున్న ఉల్లిపంట! – iDreamPost – ACPS NEWS

రైతుకు కోట్లు కురిపిస్తున్న ఉల్లిపంట! – iDreamPost – ACPS NEWS

by
0 comments
రైతుకు కోట్లు కురిపిస్తున్న ఉల్లిపంట! - iDreamPost


సూపర్ ఎల్నినో కారణంగా దేశంలో ఈ ఏడాది వర్షాలు సరిగా పడలేదు. నీళ్లు లేక పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా పంటలు దెబ్బతిన్నాయి. పంట దెబ్బతిన్న రైతులు అప్పుల పాలవుతున్నారు. అయితే, కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం కరువులోనూ కోట్లు సంపాదిస్తున్నాడు. నమ్ముకున్న ఉల్లిపంట అతడికి కోట్లు కురిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తివివరాల్లోకి వెళితే..

కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లా నవలగుంద తాలూకా సోటకనాల్ గ్రామానికి చెందిన రుగీ కుటుంబం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేపట్టింది. ప్రస్తుతం కోత పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆశించిన మేర నాణ్యమైన దిగుబడి వచ్చింది. గత ఏడాది కూడా రుగీ కుటుంబం 40 ఎకరాల్లో ఉల్లిని సాగు చేసింది. అకాల వర్షాలు, తక్కువ ధరల కారణంగా భారీ నష్టాలు వచ్చాయి. అయినా వెనక వేయకుండా, ఈ ఏడాది కూడా అదే విస్తీర్ణంలో ఉల్లిని నమ్ముకుని సాగు చేస్తున్నారు.

తీవ్రమైన కరువు సీజన్‌లో కూడా ఉల్లి పంట మంచి దిగుబడి వచ్చింది. మార్కెట్లో ఉల్లికి డిమాండ్ పెరిగి ధర కూడా కలిసివచ్చింది. సుమారు 2,500 క్వింటాళ్ల ఉల్లిని విక్రయించడం ద్వారా రుగీ కుటుంబం కోటి వరకు ఆదాయాన్ని ఆర్జించింది. సోటకనాల్ గ్రామస్థులకు ఉల్లి సాగులో ఏళ్ల అనుభవం ఉంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాభావంతో రైతులు దిగులు పడి ఉన్నారు. కానీ, ఇక్కడి రైతులు మాత్రం ఉల్లి సాగుతో చక్కటి లాభాలు గడిస్తున్నారు.

రుగీ కుటుంబంతో పాటు గ్రామంలోని రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఇంకా పొలాల్లో పంట మిగిలి ఉంది. రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోని పొలాల్లో కనుచూపు మేర ఎర్రటి దుంపల రాశులు, గోదాముల్లో బస్తాల కొద్దీ నిల్వలు, ఎండలో ఆరబెడుతూ నాణ్యమైన పంటను వేటాడుతున్న కూలీలతో సందడి.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment