Home సినిమా‘జిమ్‌ జిమ్‌ తార’ సింగర్‌ వార్నింగ్‌: పాట తీసేయకపోతే ‘ఆదర్శ కుటుంబం’ టీమ్‌పై కేసు.! – ACPS NEWS

‘జిమ్‌ జిమ్‌ తార’ సింగర్‌ వార్నింగ్‌: పాట తీసేయకపోతే ‘ఆదర్శ కుటుంబం’ టీమ్‌పై కేసు.! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా.. తాజాగా ఈ చిత్ర బృందానికి ఓ వివాదం ఎదురైంది. సోషల్ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘జిమ్‌ జిమ్‌ తార’ పాటను సినిమాలో ఉపయోగించడంపై ఒరిజినల్‌ సింగర్‌ లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి తీసుకోకుండా పాటను సినిమాలో ఎలా వాడతారని ప్రశ్నించారు. ఆ పాటను తొలగించాలని, లేదంటే వెంటనే కేసు వేస్తామని.

‘జిమ్‌ జిమ్‌ తార.. జిలేబీ తేరా చిన్నోడా’ అనే పాట కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. గోగుల లక్ష్మీదేవి పాడిన ఈ పాట ‘పర్ణశాల’ సినిమాలోనిది. ఆమె సరదాగా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.. ఆ తర్వాత చిత్ర బృందం అధికారికంగా పూర్తి పాటను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ పాటలోని సుమారు 15 సెకన్లు ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడమే వివాదానికి కారణమైంది.

ఈ విషయంపై లక్ష్మీదేవి ఓ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తమ పాటను ఉపయోగించే ముందు ‘పర్ణశాల’ చిత్ర బృందాన్ని సంప్రదించారా? వారికి లేదా ఆ సినిమా నిర్మాతలకు డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. పెద్ద సినిమాల్లో తమ పాటలను ఉపయోగించుకుంటూ.. చిన్న సినిమాలకు మాత్రం నష్టం కలిగించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో వెంటనే ఆ పాటను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ‘పర్ణశాల’ చిత్ర నిర్మాతలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఈ వివాదంపై ‘ఆదర్శ కుటుంబం’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: లాలో రీమేక్‌గా RC17.. అసలు నిజమేంటి.. సుకుమార్ తప్పు చేస్తున్నారా.?

[AK47 Movie Controversy, Jim Jim Tara Copyright Issue, Aadarsha Kutumbam Movie, Jim Jim Tara Song, Singer Lakshmi Devi, Venkatesh, Trivikram, Parnashala Movie]

You may also like

Leave a Comment