Home సినిమాగత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణానికి ఉన్న తేడా ఇదే! – ACPS NEWS

గత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణానికి ఉన్న తేడా ఇదే! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


రామాయణ.. భారతీయ ఇతిహాసంతో ముడిపడి ఉన్న అయోధ్య రాముడి జీవిత చరిత్ర.. అందుకే కళ అనేది పుట్టిన దగ్గరనుంచి ఆ ‘రాముడి’పై ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు రణబీర్, యష్, సాయి పల్లవి, నితీష్ తివారి రామాయణ సెల్యులాయిడ్ పై అడుగుపెట్టింది. మరి గత రామాయణ, ఇప్పటి రామాయణ చిత్రాలకి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం.

1971లో ఎన్టీఆర్ నటించిన ‘సంపూర్ణ రామాయణం’ మరియు 1961లో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’ వంటి క్లాసిక్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ. గ్రాఫిక్స్ లేదా సీజీఐ (CGI) టెక్నాలజీ అసలే లేని రోజుల్లో, కేవలం 100% నటినటుల సహజ సిద్ధమైన అభినయం, శక్తివంతమైన సంభాషణలు, ఘంటసాల గానం మరియు పౌరాణిక సంగీతం ద్వారా ఆ సీన్లలో జీవం నింపారు. శోభన్ బాబు, ఎన్టీఆర్, కాంతారావు వంటి దిగ్గజ నటులు తమ పాత్రల్లో లీనమై నటించడంతో ప్రేక్షకులు థియేటర్లలో భక్తి పారవశ్యంతో నమస్కారాలు చేసేవారంటే ఆ సినిమాల ప్రాణం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కాలక్రమేణా చలనచిత్ర సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాటి రామాయణ చిత్రాలకి, నేటి ఆధునిక రామాయణ దృశ్యకావ్యాలకి ఉన్న ప్రధాన వ్యత్యాసం సాంకేతిక పరిజ్ఞానంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి 2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రం నాటి భక్తి భావాన్ని,నేటి ఆధునిక విజువల్ క్వాలిటీని కలగలిపి 32 కోట్లతో ప్రదర్శించబడింది. ఈ చిత్రం వందకిపైగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని సుమారు 45 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి ఆధునిక యుగంలోనూ పౌరాణిక కథల దమ్ము ఏంటో నిరూపించింది. ఇక 2023లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రం నాటి రామాయణ నిర్మాణ శైలికి మరియు నేటి 3D మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి ఉన్న తేడాను ప్రపంచానికి చూపించింది. సుమారు 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఏకంగా 60 శాతం పైగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు VFX సీన్లు ఉపయోగించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు సాధించారు, పాత సినిమాల్లో ఉన్న నాటి భావోద్వేగాలు నేటి ఆధునిక విజువల్ టెక్నాలజీలో లొపించాయని మెజారిటీ ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: రామాయణం: రామాయణం హైలెట్స్ ఇవే.. పబ్లిక్ టాక్ పరిస్థితి అయితే ఇదే!

ఈ రోజు విడుదలైన ‘రామాయణ’ పార్ట్ 1 విజువల్స్ పరంగానూ, కంటెంట్ పరంగానూ, భావోద్వేగాలు పండించేటప్పుడు అద్భుతంగా తెరకెక్కిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ పురస్కారాలు పొందిన హాలీవుడ్ VFX సంస్థ డిఎన్‌ఈజి (DNEG) ఈ ప్రాజెక్ట్ కోసం 1000 మందికి పైగా డిజిటల్ ఆర్టిస్టులతో వర్క్ చేసింది. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో గ్లోబల్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసింది. మరి ముఖ్యంగా ప్రీవియస్ రామాయణ చిత్రాల్లో రావణుడి తల్లి, అతని యవ్వనం, లక్ష్య సాధన వైపు మళ్లడం అనేది చూపించలేదు. కానీ ఇప్పుడు రామాయణంలో చూపించారు. రాముడు, సీతాదేవి క్యారెక్టర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. పైగా త్రేతా యుగంలో రాముడు, సీతాదేవి అలాగే ఉండేవారు అనేలా కూడా అనిపిస్తుంది. ఫైనల్ గా రామాయణం మూల భావోద్వేగం, ధర్మ మార్గం అభిమానులు, ప్రేక్షకులు, రామ భక్తులు తాకిందనే మాటలు సోషల్ మీడియా వేదికగా రామాయణం చూసిన వాళ్ళు చెప్తున్నారు.

[Ramayana Movies Evolution Telugu Cinema, Ramayana Movie highlights, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]

You may also like

Leave a Comment