
ఇండియాస్ లేటెస్ట్ సెన్సేషన్ రామాయణంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే.. ప్రజలు కేవలం ఇతిహాసం గురించి మాత్రమే మాట్లాడాలని ఆయన అన్నారు. ఖర్చు గురించి, వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.
శుక్రవారం ముంబైలో జరిగిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ రామాయణ గురించి మాట్లాడుతూ.. ”రామాయణం గురించి చర్చ కేవలం రామాయణం గురించి మాత్రమే జరగాలి. అంతేకానీ దాని నిర్మాణ వ్యయం లేదా వీఎఫ్ఎక్స్ గురించి కాదు. 4,000 కోట్ల రూపాయల బడ్జెట్, వీఎఫ్ఎక్స్ అంటూ జరుగుతున్న ప్రచారం సరైనది కాదని నేను అనుకుంటున్నాను. ప్రజలు రాముడు, రావణుడు, సీత వంటి పాత్రలు, కథాంశం గురించి మాత్రమే చర్చించాలి” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఫస్ట్ డే కలెక్షన్స్
రామాయణ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రణ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో 65 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. అయితే, ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేసిన 100 కోట్ల రూపాయల మైలురాయిని మాత్రం సినిమా అందుకోలేకపోయింది. రోజు ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణ’ మొదటి మొత్తం గ్రాస్ కలెక్షన్ 127.50 కోట్ల రూపాయలకు చేరింది.
#రామాయణం సినిమాపై #సల్మాన్ ఖాన్ తన సపోర్ట్ చూపిస్తున్నాడు
మెయిన్ చాహ్తా హోన్ కే లాగ్ బాస్ రామాయణ కీ చర్చా కరే, వో అర్హుడు కర్తే హై
#MaatrubhumiTrailer https://t.co/PgTFEQYg9k
— Filmy_Duniya (@ayaanpanda1) నవంబర్ 6, 2026
