Home సినిమాఅమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే: హీరో ఎవరంటే! – ACPS NEWS

అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే: హీరో ఎవరంటే! – ACPS NEWS

by
0 comments
అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే: హీరో ఎవరంటే!


సినిమా.. సినిమా.. ఏ ముహూర్తాన భరత ఖండంపై అడుగుపెట్టిందో కానీ ఎన్నో వైభవాలని, గుర్తులని, రికార్డులని దాచుకొని ఉంది. అందుకే ఈ విశ్వంలో దాగి ఉన్న అన్ని రకాల హరివిల్లులు, రంగవల్లులు తనలో ఉన్నాయని మిడిసిపాటు. మరి మాములు వాళ్ళకే మిడిసిపాటు ఉంటే సినిమాకి ఎంత ఉండాలి అని చెప్పండి. అది కూడా నిజమేలే అనేలా సినీ సజీవ పునాదుల్లో దాగి ఉన్న ఒక రహస్యాన్ని మన ముందు ఉంచి ఆశ్చర్య పరుస్తుంది. అదే అమెరికాలో ఫస్ట్ షూటింగ్ జరుపుకున్న తెలుగు మూవీ ఇదే అనే న్యూస్

విదేశీ గడ్డపై షూటింగ్ జరుపుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. ఆ చిత్రం హరే కృష్ణ హలో రాధ. సి.వి. శ్రీధర్ దర్శకుడు. పూర్తిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో (USA) చిత్రీకరించబడిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. లాస్‌ ఏంజిల్స్‌, లాస్‌ వేగాస్‌ వంటి నగరాలతో పాటు గ్రాండ్‌ కాన్యన్‌, అరిజోనా, ఫీనిక్స్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగింది. అక్కడి సహజ సౌందర్యం, విభిన్నమైన భౌగోళిక నేపథ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి సినిమాల్లో విదేశీ లొకేషన్లను తెరపై చూడటం ప్రేక్షకులకు సాధారణ విషయమే. ఆ కాలంలో విదేశాలకు వెళ్లి సినిమాని ప్రదర్శించడం సామాన్యమైన విషయం కాదు. కానీ అప్పట్లోనే మేకర్స్ ఇంతలో ధైర్యం చేసి అమెరికాలోని ప్రముఖ ప్రాంతాల్లోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కేవలం సాంకేతికంగానే కాకుండా, నిర్మాణపరంగా కూడా టాలీవుడ్ స్థాయిని సరికొత్త శిఖరాలకు చేర్చింది.

ఇది కూడా చదవండి: 4 సెకన్లలో వందల కోట్ల ఆస్థి పోగొట్టుకున్న ప్రముఖ నటి: ఫ్యాన్స్ షాక్!

శ్రీ భరణి చిత్ర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి. భరణి రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కృష్ణ సరసన శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి వంటి ప్రముఖ నటీమణులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, జయమాలిని, పండరీబాయి, శ్రీలక్ష్మి కీలక పాత్రలలో నటించి సినిమాకు మరింత వన్నె తెచ్చారు. విదేశీ లొకేషన్లలో చిత్రీకరించినట్లు, తెలుగు ప్రేక్షకులు నాడిని ఏమాత్రం కోల్పోకుండా చక్కటి కుటుంబ కథాంశంతో, వినోదాత్మకంగా నిలిచారు. పాటలు కూడా అప్పట్లో సంచలన విజయం సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకులు విజయ భాస్కర్ గేయాలు అందించిన మధురమైన బాణీలకు, కొసరాజు రాఘవయ్య చౌదరి, వీటూరి వంటి దిగ్గజయ రచయితలు అందించిన సాహిత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేసింది.

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణి జైరామ్ సుమధుర గాత్రం సినిమా స్థాయిని మరింత పెంచింది. అమెరికా వీధుల్లో, అద్భుతమైన ప్రాకృతిక అందాల మధ్య నడిచిన ఈ సినిమా నాటి టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ లాగా నిలిచింది. నేడు టాలీవుడ్ హీరోలు హాలీవుడ్ రేంజ్‌లో అమెరికా మరియు యూరప్ దేశాలలో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నప్పటికీ, ఆ ట్రెండ్‌కు నాలుగు దశాబ్దాల క్రితమే అంకురార్పణ చేసిన సాహస చిత్రం ‘హరే కృష్ణ హలో రాధ’.అక్టోబర్ 16, 1980 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

[Hare Krishna Hello Radha First Telugu Film Shoot In Usa, Hare Krishna Hello Radha, Superstar Krishna, first telugu movie in usa, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

You may also like

Leave a Comment