
భద్రాద్రి కొత్తగూడెం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు–2026లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అక్టోబర్ 30న కొత్తగూడెం క్లబ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, సామాజిక సేవలో భాగంగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ తెలిపింది.ఈ కార్యక్రమానికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై సహకరించాలని పోలీస్ శాఖ కోరింది

తేదీ: 30-10-2026⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు📍 వేదిక: కొత్తగూడెం క్లబ్👮 ఆధ్వర్యం: కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ⭐ ముఖ్య అతిథి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్
