Home Uncategorizedకొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు షాక్.. ముగ్గురికి 2 రోజుల జైలు!

కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు షాక్.. ముగ్గురికి 2 రోజుల జైలు!

by Sahasra ACPS
0 comments

కోత్తగూడెం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి న్యాయస్థానం రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కొత్తగూడెం 2వ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎన్‌హెచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తనిఖీలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment