Home Latest Newsజగన్ ఇలాకాలో పసుపు పార్టీ పంచ్..ఐదు ఎంపీటీసీలు ఏకగ్రీవం.! | పులివెందుల రాజకీయం | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి | టీడీపీ | తెలుగుదేశం పార్టీ | చంద్రబాబు నాయుడు | బి టెక్ రవి | కడప పొలిటికల్ న్యూస్ | పులివెందుల ఎంపీటీసీ ఎన్నికలు | ఎంపీటీసీ అనూహ్య ఎన్నికలు | టీడీపీ గెలుపు | పులివెందుల ఎంపీపీ ఎన్నికలు | కడప స్థానిక సంస్థల ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | సంకీర్ణ కూటమి – ACPS NEWS

జగన్ ఇలాకాలో పసుపు పార్టీ పంచ్..ఐదు ఎంపీటీసీలు ఏకగ్రీవం.! | పులివెందుల రాజకీయం | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి | టీడీపీ | తెలుగుదేశం పార్టీ | చంద్రబాబు నాయుడు | బి టెక్ రవి | కడప పొలిటికల్ న్యూస్ | పులివెందుల ఎంపీటీసీ ఎన్నికలు | ఎంపీటీసీ అనూహ్య ఎన్నికలు | టీడీపీ గెలుపు | పులివెందుల ఎంపీపీ ఎన్నికలు | కడప స్థానిక సంస్థల ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | సంకీర్ణ కూటమి – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ల చరిత్ర తిరగేసింది. పులివెందుల మండల పరిధిలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మొత్తం ఐదు టీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం కూడా టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఏకగ్రీవాల్లో పుష్పనాథ్‌రెడ్డి పాత్ర కీలకం.!

పులివెందుల వారు కొత్తపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు పుష్పనాథ్‌రెడ్డి ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సూచనల మేరకు మిగిలిన నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునేందుకు కృషి చేశారు.

ఆయన ప్రయత్నాలు ఫలించడంతో ఐదు స్థానాలూ టీడీపీకి దక్కాయి. పులివెందుల మండల పరిధిలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాలను స్వీకరించారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఈ. కొత్తపల్లి నుంచి మాడెం పుష్పనాథ్‌రెడ్డి, ఎర్రబల్లి-2 నుంచి కడపన శ్యామలాదేవి, ఎర్రబల్లి-1 నుంచి పండిటి రాజశేఖర్, రాగిమానుపల్లి నుంచి బండి సునీత, అచ్చవెల్లి గంగనపల్లి నుంచి మహమ్మద్ షరీఫ్ ఉన్నారు.

ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి.!

పులివెందుల కోసం ఐదు ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి చూపుతోంది. ఐదు స్థానాలూ ఒకే పార్టీకి దక్కడంతో ఎంపీపీ పదవి కూడా దక్కే అవకాశం.పులివెందులలో గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకోనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీపీ ఎన్నిక పూర్తయితే మండల పరిషత్‌లో అధికార మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.

[ Pulivendula Politics, YS Jagan Mohan Reddy, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, B Tech Ravi, Kadapa Political News, Pulivendula MPTC Elections, MPTC Unopposed Elections, TDP Victory, Pulivendula MPP Election, Kadapa Local Body Elections, Andhra Pradesh Politics, Coalition Alliance, Madem Pushpanath Reddy ]

You Might Also Like

You may also like

Leave a Comment