Home Uncategorizedభద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు గడువు కంటే ముందే పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు గడువు కంటే ముందే పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

by Sahasra ACPS
0 comments

నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభం | గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాంభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.గురువారం భద్రాచలం ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి ఆలయం చుట్టూ కొనసాగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, పనులు ఇదే వేగంతో కొనసాగితే నిర్దేశిత గడువు కంటే సుమారు 10 రోజుల ముందుగానే పూర్తి చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొన్ని స్లాబుల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రాతి కట్టడాలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధమయ్యాయని వెల్లడించారు.నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభించి, వాటిని క్షేత్రస్థాయిలో ప్రతిష్ఠించే ప్రక్రియ చేపడతామని చెప్పారు. మిగిలిన కాంక్రీట్ పనులు, మాడవీధుల అభివృద్ధి పనులను సమాంతరంగా కొనసాగిస్తామని తెలిపారు.గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆలయ పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

You may also like

Leave a Comment