Home Latest Newsగులాబీ గూటికి కొండా: కేటీఆర్ కు క్షమాపణ అందుకేనా.? | KTRకి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ | తెలంగాణ రాజకీయం | కొండా సురేఖ మురళి | BRS రీఎంట్రీ రూమర్స్ – ACPS NEWS

గులాబీ గూటికి కొండా: కేటీఆర్ కు క్షమాపణ అందుకేనా.? | KTRకి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ | తెలంగాణ రాజకీయం | కొండా సురేఖ మురళి | BRS రీఎంట్రీ రూమర్స్ – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. గతంలో రాష్ట్ర రాజకీయాలలో కొండా సురేఖ కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు. గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా సూచించింది.

అప్పట్లో రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించేలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశాను వాతావరణం కొండా సురేఖ కేటీఆర్‌ వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశ్యంతో గానీ, ఆయన కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయాలని కానీ తాను ఎన్నడూ భావించలేదని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల వల్ల కేటీఆర్ కు కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నామని ఆమె ఈ వివాదానికి పూర్తిగా ముగింపు పలకాలనే సదుద్దేశం క్షమాపణలు చెబుతూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కాగా కొండా సురేఖను రేవంత్ తన కేబినెట్ నుంచి తొలగించిన తరువాత ఇప్పుడు కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సరైన కారణాలు వెల్లడించకుండా, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి వచ్చినప్పుడు ఆమె అప్పట్లోనే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ మహిళగా తనకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణ చెప్పడం, ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం పొలిటికల్ ప్రాధాన్యతగా సంతరించుకుంది. ఆమె బీఆర్ఎస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. ఈ చర్చకు కొండా సురేఖ భర్త కొండా మురళితో కలిసి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


[Konda Surekha Apologizes to KTR, Telangana Politics, Konda Surekha Murali, BRS Reentry Rumors, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment