

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు, తుపాను ముప్పులు వదలనున్నాయి. అర్నాబ్ తుపాను కష్టాలు, నష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే రాష్ట్రంపై మరో పెను తుపాను పంజా విసరడానికి సిద్ధమౌతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన మరో అల్పపీడనం క్రమంగా బలపడి రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబ్రా దీవుల సమీపంలో తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ సృష్టించింది. దీని ప్రభావంతో వచ్చే 1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇప్పటికే అర్నాబ్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరో తుపాను ముప్పు ముంచుతున్నదన్న హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో ఆందోళన వ్యక్తమౌతోంది.
[Another Cyclone Threat AP, Bay of Bengal Low Pressure, Andaman Sea Cyclone Alert, AP Weather Forecast November, Andhra Pradesh Heavy Rains, Telugu One]
