Home సినిమాత్రివిక్రమ్ రైటింగ్ సీక్రెట్ ఇదే – iDreamPost – ACPS NEWS

త్రివిక్రమ్ రైటింగ్ సీక్రెట్ ఇదే – iDreamPost – ACPS NEWS

by
0 comments
త్రివిక్రమ్ రైటింగ్ సీక్రెట్ ఇదే - iDreamPost


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పడితే థియేటర్లలో చప్పట్లు, ఈలలు మోగిపోవాల్సిందే. ఆయన రాసే డైలాగులు జనాల నోళ్లలో ఏళ్ల తరబడి నానుతూనే ఉంటాయి. అయితే అసలు ఒక కథ రాసేటప్పుడు ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? జనం ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ రాస్తారా? లేక తనదైన శైలిలో రాసుకుంటూ పోతారా? అన్న దానిపై త్రివిక్రమ్ స్వయంగా అసలు సీక్రెట్ బయటపెట్టారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్‌లో ఆయన పంచుకున్న ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన రైటింగ్ స్టైల్ గురించి వివరిస్తూ త్రివిక్రమ్ చాలా ప్రాక్టికల్ గా పంచుకున్నారు. “మనం చేసే ప్రతి కథ ఒక ప్రయత్నమే. అది హిట్ అవుతుందో లేదో ఎవరూ ముందుగా చెప్పలేరు. అయితే కథ రాసేటప్పుడు ‘అవతలి వాళ్లకు నచ్చుతుందా లేదా’ అని వాళ్ల కళ్లల్లో చూస్తూ కూర్చుంటే అసలు పనే చేయలేం. అందుకే నేను జనం వైపు చూడటం మానేస్తాను. వెనక్కి తిరిగి నాకు తెలిసిన పనిని, నాకు వచ్చిన కథను రాసుకుంటూ వెళ్తాను.

ఈ సందర్భంగా ప్రాచీన కవి పోతన చెప్పిన పద్యాన్ని గుర్తుచేస్తూ తన లాజిక్ వివరించారు త్రివిక్రమ్. “’పలికెడిది భాగవతమట.. పలికించెడి వాడు రామభద్రుండట’ అని పోతన రాశారు. అంటే ఆయన జనాల్లోనే దేవుణ్ణి చూశారు. ఒక వ్యక్తితో మాట్లాడితే వాళ్లకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ థియేటర్లలో కూర్చునే ఆడియన్స్ అనే మాస్‌కి ఒక ముఖం ఉండదు. కాకపోయినా ఇంగ్లీష్, మలయాళ, తమిళ్ సినిమాలు నచ్చుతున్నాయి మన సినిమాలను కూడా బయట వాళ్లు అంతలా ఓన్ చేసుకుంటున్నారు” అని చెప్పారు.

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రపంచం దగ్గరైపోయిందని, దీనివల్ల మంచి ఎంత జరుగుతోందో తలనొప్పులు కూడా అంతే ఉంటున్నాయని త్రివిక్రమ్ అన్నారు. “జనం ఇచ్చే అభిప్రాయాలను బట్టి మన పనిని సరిదిద్దుకుంటూ ఇంకా మెరుగవ్వాలి తప్ప, మన సొంత వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు. అందుకే నేను చాలా వరకు తక్కువగా మాట్లాడి నా పని చేసుకుంటూ వెళ్తాను. ఇదే నా రైటింగ్ ప్రాసెస్” అంటూ వివరించారు. జనం మెప్పు కోసం కాకుండా కథను నమ్ముకుని నిజాయతీగా రాయాలన్న గురూజీ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment