Home Latest Newsమియాపూర్ సీఐకి జైలు, జరిమానా: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.! | మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ కు జైలు శిక్ష | తెలంగాణ హైకోర్టు | ధిక్కార కేసు | హఫీజ్‌పేట్ ఆస్తి | పోలీస్ ప్రొటెక్షన్ కేసు – ACPS NEWS

మియాపూర్ సీఐకి జైలు, జరిమానా: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.! | మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ కు జైలు శిక్ష | తెలంగాణ హైకోర్టు | ధిక్కార కేసు | హఫీజ్‌పేట్ ఆస్తి | పోలీస్ ప్రొటెక్షన్ కేసు – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

కోర్టు జారీ చేసిన స్పష్టమైన సూచనను పాటించకుండా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన పోలీసు అధికారికి తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించబడింది. దానితో పాటు జరిమానా కూడా విధించింది. హఫీజ్‌పేటలోని ఒక వివాదస్పద ఆస్తి విషయంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసినందుకు గాను, మియాపూర్ సీఐ ఎం. ప్రేమ్ కుమార్‌కు నాలుగు వారాల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

వివరాలిలా ఉన్నాయి. హఫీజ్‌పేట పరిధిలో ఉన్న ఒక భూమికి సంబంధించి సివిల్ కోర్టు నుంచి శాశ్వత నిరోధక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వులు పొందిన వ్యక్తులకు తగిన రక్షణ కల్పించాలని గతంలో ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయితే, బాధితులు ఆశ్రయించినప్పటికీ స్థానిక పోలీసులు దానిని అమలు చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వలు బేఖాతరు చేశారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

కేసు బాధితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సి.వి. భాస్కర్ రెడ్డిని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని నిర్థారణ, కోర్టు ఉత్తర్వులు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.

[Miyapur CI Prem Kumar Jail Sentence, Telangana High Court,  Contempt Case, Hafizpet Property,  Police Protection Case, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment