Home సినిమా ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరును రివీల్ చేసిన రష్మిక! – ACPS NEWS

ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరును రివీల్ చేసిన రష్మిక! – ACPS NEWS

by
0 comments
ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరును రివీల్ చేసిన రష్మిక!



జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి వచ్చిన రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పేరును రివీల్ చేసింది. జగపతి అడిగిన కొన్న ప్రశ్నల్లో ఆమె అతని పేరు చెప్పింది. ఇంతకు ఏం అడిగారో చూద్దాం.

“జిమ్ నా ఔట్లెట్.. మీకెప్పుడైనా నన్ను కలుసుకోవాలంటే జిమ్ కి వచ్చేయండి.. మీరు నాతో పరిగెత్తొచ్చు, నడవొచ్చు, చాలా టైం కూడా స్పెండ్ చేయొచ్చు.. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి.. మంచిగా తినండి, వర్కౌట్ చేయండి, మీ బ్రెయిన్, మీ హార్ట్, మీ బాడీ చాలా ఇంపార్టెంట్” అని చెప్పింది రష్మిక.

“జిమ్ కి వచ్చేయండి అని చెప్పడం తేలిక..ఏ జిమ్ ఏ టైం అని చెప్పాలి కదా” అని జగపతి బాబు ఆడియన్స్ తో అన్నారు. “బొంబాయికి వస్తే జెడబల్యు హోటల్ లో ఉంటా. హైదరాబాద్ లో 3 జిమ్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్తే తిడతారు. రౌడీ జిమ్ అని స్టార్ట్ చేయాలి. పేరు కూడా బాగుంది కదా. అక్కడికి వచ్చేయండి నేనే ట్రైన్ చేస్తాను.” అని చెప్పింది.

ఇక వేలికి ఉన్న ఉంగరాలు చూసి “ఆ రింగ్స్ ఏమన్నా సెంటిమెంటా” అని కూడా అడిగారు. “సెంటిమెంట్ సర్. పచ్చ ఉంగరం ఆస్ట్రాలజీ పరంగా బాగుంటుంది అన్నారు. పెట్టుకున్నాను. ఇంకోటి స్టైలింగ్ కోసం. ఇక ఈ మెర్క్యూరీ రింగ్ ఒక స్పెషల్ గిఫ్ట్” అని చెప్పింది.

“డియర్ కామ్రేడ్ నీ ఫేవరేట్ ఫిలిం కదా దానికి రీజన్ ఏమన్నా ఉందా” అని అడగగా.. ” ఆ టైములో స్క్రిప్ట్ రావడం క్రికెటర్ అయ్యి క్రికెట్ నేర్చుకోవడం చేసాను. ఇప్పటికీ ఆ మూవీ గురించి మెసేజెస్ వచ్చింది. అలాగే గీత గోవిందం తర్వాత వెంటనే మళ్ళీ విజయ్ తో ఈ మూవీ చేయడం చాలా స్పెషల్ నాకు. వెళ్ళింది నా పర్ఫార్మెన్స్ కూడా ఆ మూవీలో బాగా కనిపిస్తుంది.” అని చెప్పింది.

“నీ వార్డ్ రోబ్ లో ఉండే ఎక్స్పెన్సివ్ థింగ్ ఏమిటి” అని అడిగారు. “ఒక స్పెషల్ పర్సన్ గిఫ్ట్ చేసిన ఈ మెర్క్యూరీ రింగ్” అని చెప్పింది. తర్వాత “ఫాషన్ అడ్వైస్ తీసుకోవాలంటే ఏ యాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటావ్” అని అడిగారు. “ఒక్కటే పేరొస్తుంది సర్. విజయ్ దేవరకొండ దగ్గర నుంచి” అని చెప్పింది రష్మిక.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird