
నవంబర్ 9, 2025 11:31AMన పోస్ట్ చేయబడింది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న… ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ తిరగడం… జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో తప్ప ప్రజల సమస్యలపై…అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల వరంగల్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరంగల్ నర్సంపేట పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా… జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన మాదన్నపేట చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
కట్ట పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కళాశాలల అధ్యాపకులు ఫీజు రియంబర్స్‌మెంట్ పై వినతిపత్రం జాగృతి అధ్యక్షురాలు కవితలు అందించారు. అనంతరం కవిత మాట్లాడుతూ… జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గం రావడం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.
ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట చెరువుకు సంబంధించి పట్టేవాగుపై లెవెల్ వంతెన నిర్మాణంతోపాటు… చెరువు మత్తడి ఎత్తు పెంచి నిర్మించవలసి ఉందని… ఆ విధంగా నిర్మించడం వల్ల ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లో లెవెల్ వంతెన మత్తడి ఎత్తు పెంచేందుకు ఇంతకుముందే టెండర్ అయినట్టు తెలిసిందని, ఆ రెండు నిర్మించలేదని ఈ రెండిటిపై స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని నల్లవెల్లి రోడ్డు మార్గంలో గుంతలు ఏర్పడి రోడ్లు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రజల సమస్యపై కానీ అభివృద్ధిపైనా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదు అన్నారు. అదేవిధంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేయలేదని 150 పడకల ఆసుపత్రిలో తగ్గింపు ఇంతవరకు పూర్తి ఏర్పాట్లు చేయలేదని ఈ సమస్యపై శ్రద్ధపెట్టాలని అన్నారు.
మొంథా తుఫాను ప్రభావంతో పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మొక్కుబడిగా సమావేశం నిర్వహించారు. అధికారులను లోతుగా సర్వే చేయించి రైతులకు వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా… కళాశాలలకు సంబంధించి ఫీజ్ రియంబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తండ్రిగా కేసీఆర్ పిలిస్తే ఇంటికి వెళ్లానని కానీ బీఆర్‌ఎస్‌కు తనకు సంబంధం లేదని స్ఫష్టం చేశారు. ఈ చర్య పార్టీ వెనుక కొందరి కుట్ర ఉందని.
