

సుప్రీం హీరో సాయి దుర్గాతేజ్ తో చేసిన చిత్రాల ద్వారా అభిమానుల, ప్రేక్షకుల మైండ్ లో తిష్ట వేసిన భామ రెజీనా కసాండ్రా. ఈ నెల 6న ‘మూకుత్తి అమ్మన్ పార్ట్ 2’ (తెలుగులో ‘మహాశక్తి’) ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతారతో పాటు తనది కూడా కీ రోల్. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో హీరోయిన్స్ పై రెజీనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆమె మాట్లాడుతూ మూకుత్తి అమ్మన్ పార్ట్ 2 ‘ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన 60 అడుగుల భారీ కటౌట్ చూసి ఎంతో సంతోషించాను. కేవలం హీరోలకే కాకుండా హీరోయిన్స్ కి కూడా అలాంటి అట్టహాసాలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేసే సంస్కృతి రావాలి. దశాబ్దాలుగా చూస్తే మహిళా నటీమణులకు ఇలాంటి ప్రత్యేక గౌరవాలు దక్కడం చాలా అరుదైన విషయమని, అయితే నయనతారకు పడిన ఈ 60 అడుగుల కటౌట్ ట్రెండ్‌లో ఓ సానుకూల పరిణామమని ఆమె కొనియాడారు. ఇంకా, గతంలో ‘తాయ్ కిళవి’ చిత్రం కోసం అనుభవజ్ఞులైన నటి రాధికా శరత్‌కుమార్‌కు కూడా ఇలాంటి ఘనత దక్కిందని రెజీనా గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి: స్వచ్ఛమైన ప్రేమ చిత్రాలు కనుమరుగవుతున్నాయా? లేక ఇప్పటికి వస్తున్నాయా!
.webp)
సుమారు 30 నుంచి 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తూ, ఎన్నో విజయాలను అందుకుంటున్న రాధిక లాంటి సీనియర్ నటిమణులకు ఇప్పుడైనా ఈ స్థాయి గుర్తింపు రావడం చాలా సంతోషకరమైన విషయమని ఆమె పేర్కొన్నారు. ఇక ఇదే చిత్రంలో తాను తొలిసారిగా ఓ భారీ కమర్షియల్ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటించినట్లు రెజీనా తెలిపింది. ఒకే రకమైన సాధారణ పాత్రలకు పరిమితం కాకుండా, ఒకే విభిన్నమైన ఛాయలున్న రోల్స్ తన లక్ష్యమని, ప్రాజెక్ట్‌ల ఎంపికలో చాలా ఆచితూచి ఉందని అందుకే స్పష్టం చేశారు.
[Regina Cassandra About Female Cutouts, Regina Cassandra Latest Interview, Nayanthara, Mookuthi Amman 2, 60 foot cutout, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
