Home Latest NewsWPL 2027 షెడ్యూల్ విడుదల: తొలి మ్యాచ్‌ ఆర్సీబీతో ముంబయి ఢీ.! | WPL 2027 షెడ్యూల్ | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2027 | RCB vs ముంబై ఇండియన్స్ | BCCI WPL ఫిక్స్చర్స్ | WPL 2027 తేదీలు | మహిళల క్రికెట్ – ACPS NEWS

WPL 2027 షెడ్యూల్ విడుదల: తొలి మ్యాచ్‌ ఆర్సీబీతో ముంబయి ఢీ.! | WPL 2027 షెడ్యూల్ | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2027 | RCB vs ముంబై ఇండియన్స్ | BCCI WPL ఫిక్స్చర్స్ | WPL 2027 తేదీలు | మహిళల క్రికెట్ – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మహిళా మెగా టోర్నీ వస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. భారత క్రికెట్ మండలి (బీసీసీఐ నియంత్రణ) ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు డబ్ల్యూపీఎల్ 2027 టోర్నీ జరగనుంది. దాదాపు మూడు వారాల పాటు ఐదు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.

తొలి మ్యాచ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్.!

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం అందనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్లు తొలి పోరులో తలపడుతున్నాయి. జనవరి 14న జరిగే ఈ మ్యాచ్‌తో ఐదో సీజన్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన జట్లు తలపడుత రెండు అభిమానుల్లో ఆసక్తి.

రెండు నగరాల్లో.. 22 మ్యాచ్‌ల సందడి.!

ఈసారి టోర్నీని వడోదర, ముంబయి నగరాల్లో నిర్వహిస్తున్నారు. తొలి విడత మ్యాచ్‌లకు వడోదర ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 14 నుంచి 24 వరకు ఇక్కడ మొత్తం 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం జట్లన్నీ ముంబయికి చేరుకోనున్నాయి. జనవరి 26 నుంచి ముంబయిలోని చారిత్రాత్మక బ్రాబోర్న్ స్టేడియంలో తదుపరి మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో దశలో మరో 11 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

ఫైనల్ బెర్త్ కోసం ఆసక్తికర పోరు.!

ఐదు ఫ్రాంచైజీలు పోటీపడనున్న ఈ లీగ్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్‌లో చోటు దక్కనుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 5న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 7న గ్రాండ్ ఫినాలే జరగనుంది.

స్టార్ ప్లేయర్ల సందడికి రంగం సిద్ధం.!

గత సీజన్లలో మహిళల ప్రీమియర్ లీగ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈసారి కూడా అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు, యువ ప్రతిభావంతులు తమ ఆటతీరుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం. మొత్తానికి మహిళా క్రికెట్‌లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేవబోతోంది. టైటిల్ నిలబెట్టుకోవాలని ఆర్సీబీ.. మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ముంబై ఇండియన్స్.. మిగిలిన జట్లు కూడా ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరి ఈసారి విజేతగా నిలిచే జట్టు ఏదో తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు వేచి చూడాల్సిందే!

[ WPL 2027 Schedule, Womens Premier League 2027, RCB vs Mumbai Indians, BCCI WPL Fixtures, WPL 2027 Dates, Womens Cricket, Telugu Sports News ]

You Might Also Like

You may also like

Leave a Comment