Home సినిమాUPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి – ACPS NEWS

UPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి – ACPS NEWS

by
0 comments
UPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి


దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌తో పాటు ఇతర సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ‘యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2026’ ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఈ ఫలితాల పీడీఎఫ్ (PDF) కాపీని అందుబాటులోకి తెచ్చింది. మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 2,526 మంది అభ్యర్థులు తుది దశ అయిన ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు అర్హత సాధించారు.

1,016 ఖాళీలు.. రేసులో 13,343 మంది అభ్యర్థులు

ఈ ఏటి నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ ఖాళీలను భర్తీ చేయనుంది. జూన్2026 ఆగస్టు 21, 22, 23, 29, మరియు 30 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్షలకు దేశవ్యాప్తంగా 13,343 మంది అభ్యర్థులు ఉన్నారు. తీవ్ర పోటీ మధ్య సాగిన ఈ పరీక్షల్లో ఘన విజయం సాధించి 2,526 మంది తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.

ఢిల్లీ వేదికగా ఇంటర్వ్యూలు

మెయిన్స్ క్లియర్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని యూపీఎస్సీ ధోల్‌పూర్ హౌస్ ఆవరణలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన సమగ్ర షెడ్యూల్, అభ్యర్థుల ఇ-సమ్మన్ లేఖల వివరాలను త్వరలో తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించనుంది.

2027 అభ్యర్థులకు మార్గదర్శనం

రాబోయే 2027 సివిల్ సర్వీసెస్ పరీక్షలను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులకు ఈ ఫలితాలు దిక్సూచిగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక, ఆప్షనల్ సబ్‌క్టుపై స్పష్టమైన పట్టు, నిరంతర సాధన ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత విద్యా సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment