Home సినిమాసీన్ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్! – ACPS NEWS

సీన్ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్! – ACPS NEWS

by
0 comments
సీన్ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!


వరుస సూపర్ హిట్ హ్యాట్రిక్స్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజీ టాక్ గా మారాడు సూర్య. నిన్న విడుదలైన ‘సీన్’ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఎనామస్ గా హిట్ టాక్ వస్తుంది. ఇక అభిమానుల ఆనందం గురించి అయితే చెప్పక్కర్లేదు.

ఇది మా సూర్య రేంజ్ ఈ దీపావళి సరికొత్త కాంతులని తెచ్చిందని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఫస్ట్ డే ఎంత రాబట్టిందో చూద్దాం.

ట్రేడ్ నివేదికల ప్రకారం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 34.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను కొల్పింది. ఇండియా గ్రాస్ కలెక్షన్లు 22.25 కోట్లు కాగా ఓవర్సీస్ మార్కెట్ 12 కోట్ల గ్రాస్. దీంతో మరో సారి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూర్య స్టామినా ఏ పాటిదో తెలియజేసింది.

తమిళనాడు రాష్ట్రంలో తొలిరోజు ముందస్తు టికెట్ల రూపంలో 9.6 కోట్ల వసూళ్లు రావడం సూర్యా స్టార్‌డమ్‌కు నిదర్శనం.తమిళనాడులో ముఖ్యంగా చెన్నై నగరంలో 834 షోలకు గాను 72.3 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇది కూడా చదవండి: మహాశక్తి మూవీ రివ్యూ

అలాగే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో 287 షోలలో 60.8 శాతం ఆక్యుపెన్సీ నమోదవ్వగా, విశాఖపట్నం (69.0%) మరియు విజయవాడ (61.8%) నగరాల్లో అత్యధిక ఆక్యుపెన్సీ రేటు నమోదైంది.

తొలిరోజు దక్కిన పాజిటివ్ టాక్, వీకెండ్ బుకింగ్స్ వేగవంతంగా సాగుతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా మారింది. తెలుగు వెర్షన్ 15.7 శాతం వాటాతో 3.00 కోట్ల నెట్ వసూళ్లు. జితు మాధవన్ దర్శకుడు కాగా నజ్రియా హీరోయిన్.

మీకు నచ్చవచ్చు :రామాయణ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
మీకు నచ్చవచ్చు : సాయి దుర్గ తేజ్ ఎంగేజ్మెంట్

[scene Movie First Day collections, Scene Movie First Day Box Office Collections, Suriya Scene Worldwide Opening Day Collection, Scene Movie India Net Collection, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]

You may also like

Leave a Comment