Home సినిమాత్రిష డ్రీమ్ రోల్ దొరికేసిందా? – iDreamPost – ACPS NEWS

త్రిష డ్రీమ్ రోల్ దొరికేసిందా? – iDreamPost – ACPS NEWS

by
0 comments
త్రిష డ్రీమ్ రోల్ దొరికేసిందా? - iDreamPost


సౌత్ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది త్రిష. గ్లామర్ రోల్స్ అయినా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా తనదైన నటనతో మెప్పించే త్రిషకు తన కెరీర్‌లో ఎప్పటినుంచో ఒక పెద్ద కోరిక ఉండిపోయింది. అదే తమిళనాడు దివంగత సీఎం, అలనాటి అందాల తార జయలలిత బయోపిక్‌లో నటించడం. ఎప్పుడో చెప్పిన ఆ కోరిక ఇప్పుడు నిజమయ్యే మంచి ఛాన్స్ త్రిషకు దక్కినట్లు ఉంది. గతంలో ఓసారి ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ.. “కల్పనా చావ్లా, మార్లిన్ మన్రో, జయలలిత.. ఈ ముగ్గురిలో ఎవరి బయోపిక్‌ చేయాలా?” అని అడిగితే త్రిష ఏమాత్రం ఆలోచించకుండా జయలలిత పేరే చెప్పారు. అంతేకాదు జయలలిత చదువుకున్న చెన్నైలోని ‘చర్చ్ పార్క్’ స్కూల్లోనే త్రిష కూడా చదువుకున్నారు.

ఇప్పుడు ఆ ఎదురుచూపులు ఫలించే టైం వచ్చినట్లే. లెజెండరీ నటుడు, తమిళనాడు దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) లైఫ్ స్టోరీతో ‘పురట్చితలైవర్ ఎంజీఆర్’ పేరుతో ఒక భారీ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎంజీఆర్ పాత్రను స్వయంగా చేస్తున్న నటుడు జేఎం బషీర్.. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన జయలలిత రోల్ కోసం త్రిషతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. “జయలలిత పాత్రను త్రిష చేస్తే సినిమా స్థాయి ఎక్కడికో వెళ్తుంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు నడుస్తున్నాయి” అని తాజాగా బషీర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఎంజీఆర్ సినీ కెరీర్‌తో పాటు తమిళ పాలిటిక్స్‌ను శాసించిన అన్నాదురై, కరుణానిధి లాంటి పెద్ద లీడర్ల పాత్రలు కూడా ఉండబోతున్నాయి. ఎంజీఆర్ రాజకీయ, సినీ జీవితాల్లో జయలలిత పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అలాంటి పవర్ ఫుల్ రోల్‌లో త్రిష కనిపిస్తే ఆడియన్స్‌కు పక్కా ట్రీట్ అవుతుందని అంటున్నారు. తన డ్రీమ్ రోల్ కావడంతో త్రిష కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఎంతోకాలంగా ఈ పాత్రకు త్రిష ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment