Home సినిమాకొత్త ఐఫోన్ ఫీచర్లు లీక్ – iDreamPost – ACPS NEWS

కొత్త ఐఫోన్ ఫీచర్లు లీక్ – iDreamPost – ACPS NEWS

by
0 comments
కొత్త ఐఫోన్ ఫీచర్లు లీక్ - iDreamPost


ఆపిల్ నుంచి కొత్త బడ్జెట్ ఐఫోన్‌గా ఐఫోన్ 18e గురించి వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లో A20 చిప్, 9GB RAM, 24MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. అయితే కంపెనీ ఇప్పటివరకు ఈ ఫోన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం..2027లో ఐఫోన్ 18e మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 18eలో Apple A20 చిప్‌ను ఉపయోగించాల్సిన సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 17eలో A19 చిప్ ఉంది. కొత్త చిప్ వస్తే యాప్ల పర్ఫామెన్స్, పవర్ కెపాసిటీ, AI ఆధారిత పనుల్లో మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 9GB RAM ఉండొచ్చని గతంలోనూ విశ్లేషకులు అంచనా వేశారు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు అదనపు మెమరీని ఉపయోగించవచ్చు. అయితే A20 చిప్, RAM కెపాసిటీ పై యాపిల్ అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.

60Hz డిస్ప్లేనే కొనసాగించే అవకాశం

లీకుల ప్రకారం.. ఐఫోన్ 18eలో 6.12 LTPS OLED డిస్ప్లే ఉండవచ్చు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. అంటే స్క్రోలింగ్, యానిమేషన్ల విషయంలో 120Hz డిస్ప్లే ఉన్న ఫోన్‌లతో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుత ఐఫోన్ 17eలో 6.1 OLED డిస్ప్లే ఉంది. కొత్త మోడల్‌లో స్క్రీన్ సైజులో స్వల్ప మార్పు మినహా పెద్ద అప్‌ ఉండకపోవచ్చని టెక్ నివేదికలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వివో నుంచి అదిరిపోయే ఫోన్లు

48MP వెనుక కెమెరా.. 24MP సెల్ఫీ కెమెరా?

కెమెరాల విషయంలో వెనుకవైపు 48MP ప్రధాన కెమెరానే కొనసాగించడానికి లీకులు సూచిస్తున్నాయి. అయితే ముందు కెమెరాలో అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17eలో 12MP ఫ్రంట్ కెమెరా ఉండగా, ఐఫోన్ 18eలో 24MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడిన సమాచారం. ఇది నిజమైతే సెల్ఫీలు, వీడియో కాల్స్‌లో మరింత వివరంగా చిత్రాలు అందే అవకాశం ఉంది. కానీ ఈ కెమెరా వివరాలు కూడా ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.

ఇది కూడా చదవండి: అల్ట్రా లైట్ వైట్ లాప్ టాప్

ఐఫోన్ 17e ధర ఎంత?

ప్రస్తుతం ఐఫోన్ 17e భారత్‌లో 256GB వేరియంట్‌కు రూ.64,900 ప్రారంభ ధరతో విడుదలైంది. 512GB మోడల్ ధర రూ.84,900గా ఉంది. ఇందులో A19 చిప్, 48MP ప్రధాన కెమెరా, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, MagSafe ఛార్జింగ్ ఉన్నాయి. ఐఫోన్ 18e ధర, భారత్‌లో విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. కొత్త ఫోన్ కొనాలనుకునేవారు తుది స్పెసిఫికేషన్లు, ధర వెల్లడయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

You may also like

Leave a Comment