Home సినిమాతెలుగు మార్కెట్‌ను లైట్ తీసుకున్నారా? – iDreamPost – ACPS NEWS

తెలుగు మార్కెట్‌ను లైట్ తీసుకున్నారా? – iDreamPost – ACPS NEWS

by
0 comments
తెలుగు మార్కెట్‌ను లైట్ తీసుకున్నారా? - iDreamPost


కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మన తెలుగులో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన డబ్బింగ్ హీరోలా కాకుండా, మన సొంత హీరోలా ఇక్కడి జనం ఆదరిస్తారు. గతంలో వచ్చిన సూర్య ‘వీరభద్రుడు’, మొన్నామధ్య వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు కొల్లగొట్టాయో అందరం చూశాం. స్ట్రెయిట్ సినిమాలతో సమానంగా కలెక్షన్లు కురిపించి.. తమిళంలో ఎక్కువగా మనోళ్లే ఆ సినిమాలను సూపర్ హిట్ చేశారు.

అలాంటి సూర్య నుంచి వస్తున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ ‘సీన్’. మలయాళంలో ‘ఆవేశం’తో ఒక ఊపు ఊపిన డైరెక్టర్ జీతూ మాధవన్ తీసిన సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తోంది. తీరా చూస్తే రిలీజ్‌కు సరిగ్గా వారం రోజులే టైం ఉంది. కానీ తెలుగులో ఈ సినిమాపై ఉండాల్సినంత బజ్ అస్సలు కనిపించడం లేదు. తెలుగు మార్కెట్‌ను సూర్య ఏమైనా లైట్ తీసుకున్నారా, ప్రమోషన్లలో ఇంత సైలెంట్‌గా ఎందుకు ఉన్నారు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

You may also like

Leave a Comment