Home సినిమాఫ్రైడే రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా? – ACPS NEWS

ఫ్రైడే రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా? – ACPS NEWS

by
0 comments
ఫ్రైడే రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా?


ప్రతి వారం కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయా అని సినీ లవర్స్ అందరూ క్యాలెండర్‌లో చూసుకునే రోజు శుక్రవారం. పెద్ద హీరో సినిమా, చిన్న సినిమా అయినా సరే… థియేటర్లలోకి రావడానికి అందరూ ఎంచుకునేది ఫ్రైడేనే. ఏదైనా పండుగ ఉంటే తప్ప, మిగిలిన టైంలో శుక్రవారమే సినిమా రావాలంటే ఒక పద్ధతి దశాబ్దాలుగా నడుస్తోంది. కానీ అసలు ఈ ‘ఫ్రైడే రిలీజ్’ వెనుక ఎంత పెద్ద కథ ఉందో చాలా మందికి తెలీదు. దీని వెనుక హాలీవుడ్ నుంచి దిగుమతి అయిన పక్కా బిజినెస్ ప్లాన్ ఉందట.

అమెరికా నుంచి వచ్చిన ఐడియా

సినిమాలను శుక్రవారం రిలీజ్ చేసే ఈ పద్ధతి మన దగ్గర కాకుండా ముందుగా హాలీవుడ్‌లోనే స్టార్ట్ అయింది. 1940లకు ముందు అక్కడ ఏ రోజు పడితే ఆ రోజు సినిమాలను థియేటర్లలోకి వదిలేసేవారు. అయితే మిగిలిన రోజులతో తాజా శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్లు మామూలు రోజుల్లో కనిపించేవి కావు. దీనితో ఒక పక్కా ప్లాన్‌తో 1939లో ‘గాన్ విత్ ది విండ్’ అనే సినిమాను శుక్రవారం విడుదల చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడంతో హాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఫిక్స్ అయిపోయింది.

మన దేశంలో ఎలా మొదలైందంటే

ఇక మన దేశానికి వస్తే… బ్రిటీష్ వాళ్ల కాలంలో, ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనూ ఉద్యోగులకు శుక్రవారం పూట హాఫ్ డే మాత్రమే పని ఉండేది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే జనాలు వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయేవారు. ఈ ఖాళీ టైన్ని క్యాష్ చేసుకోగా చూసిన సినిమా వాళ్లు, మెల్లగా రిలీజ్‌లను శుక్రవారానికి మార్చడం మొదలుపెట్టారు.

అయితే, ఇండియా మొత్తం మీద ఈ పద్ధతిని ఒక బలమైన రూల్‌గా మార్చిన సినిమా మాత్రం ‘మొఘల్-ఎ-ఆజం’. 1960 ఆగస్టు 5న సరిగ్గా శుక్రవారం నాడు ఈ చారిత్రక విడుదల చేశారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో, బాలీవుడ్‌తో పాటు మన టాలీవుడ్‌లోనూ ఈ శుక్రవారం సెంటిమెంట్ పక్కగా పాతుకుపోయింది.

శుక్రవారం వెనుక ఉన్న అసలు లెక్కలివే..

సినిమా రిలీజ్‌కు శుక్రవారమే ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా బాగుందా లేదా దానికంటే ముందే, పెట్టిన డబ్బుల్లో ఎక్కువ భాగం ఫస్ట్ మూడు రోజుల్లోనే రాబట్టడం ఇండస్ట్రీలో చాలా ముఖ్యం. శుక్రవారం మార్నింగ్ షో పడగానే టాక్ బయటకు వస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చిందో లేదో… శని, ఆదివార థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోతాయి.

పాత రోజుల్లో ఫిలిం రీల్స్ ద్వారా సినిమాలు ప్రదర్శించేటప్పుడు, మిగిలిన రోజులతో శుక్రవారం నాడు స్క్రీనింగ్ ఖర్చులు కొంత తక్కువగా ఉండేవి. అలాగే మన నిర్మాతలు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. శుక్రవారం మహాలక్ష్మికి ఇష్టమైన రోజు, ఆ రోజు సినిమా జనం ముందుకు తెస్తే డబ్బుల వర్షం కురుస్తుందనే నమ్మకం కూడా ఒక కారణం అని చెబుతున్నారు.

ఇప్పుడు కాస్త రూట్ మారింది..

అయితే ఇప్పటి రోజుల్లో ఈ లెక్కల్లో కాస్త మార్పులు వచ్చాయి. సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలు గానీ, ఇండిపెండెన్స్ డే లాంటి సెలవులు గానీ బుధ, గురువారాల్లో వస్తే మాత్రం మేకర్స్ అస్సలు ఆగడం లేదు. నాలుగు, ఐదు రోజుల లాంగ్ వీకెండ్‌ను వాడుకోవడానికి గురువారమే థియేటర్లలోకి దిగిపోతున్నారు. కానీ రోజుల్లో ఎలాంటి పండుగలు లేని సాధారణ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ‘శుక్రవారం రిలీజ్ రూల్’ ఇప్పటికీ చెక్కుచెదరకుండా నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment