

నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే భారీ ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆయన మాస్ యాక్షన్ సన్నివేశాలకు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఈసారి బాలయ్య తన సాధారణ ఫార్ములాకు బదులుగా సరికొత్త ప్రయోగం చేయబోతున్నారా? ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ, మనోజ్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. సాధారణంగా ఇద్దరు బలమైన ప్రత్యర్థులు తలపడితే భారీ ఫైట్లు, రక్తపాతం ఉంటాయని భావిస్తున్నారు. కానీ ‘దాదా’లో మాత్రం అలాంటివేమీ లేకుండా కేవలం మాటలతోనే ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుందని టాక్.
బాలయ్య తనదైన గంభీరమైన గొంతుతో పవర్ఫుల్ డైలాగులు చెబితే.. మంచు మనోజ్ కూడా అంతే ధీటుగా కౌంటర్లు ఇస్తాడని అంటున్నారు. ఇద్దరి మధ్యా సాగే ఈ సంభాషణలు ప్రేక్షకుల్లో హై వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేసేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా మాటలతోనే ప్రత్యర్థిని దెబ్బతీసే ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయని సమాచారం.

‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై భారీ అంచనాలు ఉన్నాయి. 1980 నాటి ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి: పాకెట్ రాకెట్స్ టీజర్.. గ్యాంబ్లింగ్ స్టోరీతో నిహారిక మరో కొత్త ప్రయత్నం.!
[Balakrishna Manchu Manoj Face Off, Dada Movie Update, Dada Movie, Nandamuri Balakrishna, Manchu Manoj, Gopichand Malineni, Kajal Aggarwal, Telugu Film News]
