Home Latest Newsనర్సీపట్నంలో కూటమి ప్రభంజనం..చైర్‌పర్సన్‌గా పద్మావతి ఘనవిజయం. ! | నర్సీపట్నం మున్సిపాలిటీ | చింతకాయల పద్మావతి | ఏపీ మున్సిపల్ ఎన్నికలు | NDA కూటమి విజయం | అయ్యన్నపాత్రుడు | ఏపీ మున్సిపల్ ఎన్నికలు | YSRCP | తెలుగు వార్తలు – ACPS NEWS

నర్సీపట్నంలో కూటమి ప్రభంజనం..చైర్‌పర్సన్‌గా పద్మావతి ఘనవిజయం. ! | నర్సీపట్నం మున్సిపాలిటీ | చింతకాయల పద్మావతి | ఏపీ మున్సిపల్ ఎన్నికలు | NDA కూటమి విజయం | అయ్యన్నపాత్రుడు | ఏపీ మున్సిపల్ ఎన్నికలు | YSRCP | తెలుగు వార్తలు – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి అఖండ విజయం. !

అనకాపల్లి నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. పురపాలక సంఘం పీఠాన్ని కైవసం చేసుకుని తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది.మొత్తం 40 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాలను దక్కించుకున్నారు. టీడీపీ ఏకంగా 34 వార్డులలో విజయకేతనం ఎగరేయగా, మిత్రపక్షమైన జనసేన పార్టీ మరో 3 స్థానాలను కైవసం చేసుకుంది.

అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క వార్డుకు పరిమితం కాగా, మిగిలిన స్థానాలను ఇతరులు దక్కించుకున్నారు.కూటమి మున్సిపల్ మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి పోటీ చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 11,519 ఓట్ల భారీ మెజారిటీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ గెలుపుతో నర్సీపట్నంలో కూటమి శ్రేణులు సంబరాలు అంబరాన్ని తాకాయి.స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ పట్టణంలో పండుగ వాతావరణం సృష్టించారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి విజేత పద్మావతి మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని. నర్సీపట్నం పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ ప్రగతిపథంలో నడిపిస్తామని చెప్పారు.ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు రోజుల్లో స్థానిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగవంతం కాగలవని స్థానికులు.

[ Narsipatnam Municipality, Chinthakayala Padmavathi, AP Municipal Elections, NDA Alliance Victory, Ayyannapatrudu, AP municipal elections, YSRCP, Telugu News, Telugu One ]

You Might Also Like

You may also like

Leave a Comment