
అనగనగా ఓ పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన చాలా మొహమాటస్తుడు..నెమ్మదైన వ్యక్తి. ఇండస్ట్రీ టాప్ జనాలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయన స్వంత చార్టర్ ఫ్లయిట్ వచ్చి వాల్తుంది. అడగడమే ఆలస్యం. నో అనరు అన్నది ఇండస్ట్రీ టాక్. అలాంటి వ్యక్తి కొడుకు సినిమా చేస్తున్నాడు. ఆ కుర్రాడు ఇంకా నెమ్మది. ఇంకా మొహమాటస్తుడు. దాంతో ఆ సినిమాకు పని చేస్తున్న ఓ కీలక టెక్నీషియన్ చార్టర్ ఫ్లయిట్ ను గట్టిగా వాడేసారట. ఎంతలా అంటే మరీ ఆటోలా వాడేస్తున్నారు అని పెద్దాయన తన సన్నిహితుల దగ్గర అనేంతగా.
టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే. తమది కాకపోతే కాశీ వరకు డేకేస్తా అనే టైపు జనాలు ఎక్కువగా ఉంటారు. సరైన పార్టీ దొరకాలే కానీ ఫుల్ గా వాడేస్తారు. స్మూత్ గా వాడేస్తారు. అవతలి వారికి నొప్పి తెలియకుండానే. ఇక్కడ నిర్మాతలు నో చెప్పడం నేర్చుకోవాలి. కానీ అది చాలా అంటే చాలా కష్టం.

